కీలక నిర్ణయాల్లో పౌరుల భాగస్వామ్యం

2
ప్రభుత్వ పోర్టల్‌ను ప్రారంభించిన మోడీ

న్యూఢిల్లీ, జూలై 26 (జనంసాక్షి) :

కీలక నిర్ణయాల్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. దేశ ప్రజలకు పాలనను మరింత చేరువులోకి తీసుకువెళ్లడానికి ఆయన చర్యలు ప్రారంభించారు. పాలనలో పౌరులను మరింత భాగస్వాములను చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. కీలకమైన విధాన నిర్ణయాల్లో ప్రజల సలహాలు, సూచనలు, అభిప్రాయాల సేకరణ కోసం శనివారం డీబ్ల్యూడబ్ల్యూడాట్‌ఎంవైజీవోవిడాట్‌ఎన్‌ఐసీడాట్‌ఇన్‌ అనే వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభించారు. గంగానది ప్రక్షాళన చేయడం, నిరక్షరాస్యత నిర్మూలన, బాలిక విద్య తదితర అంశాలకు సంబంధించి పౌరులు తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు దీనికి అందిచవచ్చని అన్నారు. ఈ పోర్టల్‌లో ప్రజలు నేరుగా చర్చావేదికలో వీలు కల్పిస్తుందని అన్నారు.