సోనియా ఇంట్లో ఇఫ్తార్ విందు
న్యూఢిల్లీ, జూలై 27 (జనంసాక్షి) :
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తన నివాసం టెన్ జన్‌పథ్‌లో ఆదివారం సాయంత్రం పార్టీ నేతలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. సోనియాగాంధీ నివాసంలో పదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం మళ్లీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఎన్‌డీఏ పరిపాలన కాలంలో ఇఫ్తార్ విందు ఇచ్చిన సోనియాగాంధీ 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇచ్చిన విందులోనే పాల్గొనేవారు. పార్టీ ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్లీ సోనియా ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్, జనతాదళ్ (యూ) అధినేత శరద్‌యాదవ్, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, ముస్లిం నాయకులు తదితరులు హాజరయ్యారు. బీహార్‌లో త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, జేడీ(యూ) కలిసి పోటీ చేసే అంశంపై ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం.