మాసాయిపేట ప్రమాదంపై రాష్ట్రపతి సంతాపం
న్యూఢిల్లీ/హైదరాబాద్, జూలై 28 (జనంసాక్షి) :
మాసాయిపేట ప్రమాదంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన విద్యార్థుల తల్లిదండ్రులను ఓదార్చేందుకు, ఇతరత్రా సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అందుతున్న సహాయాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు గవర్నర్‌కు రాష్ట్రపతి లేఖ రాశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు కూడా తన సంతాప ప్రకటనను పంపారు.