ప్రతిపక్ష ¬దాపై త్వరలో నిర్ణయం
నిబంధన మేరకే వ్యవహరిస్తా : లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్
న్యూఢిల్లీ, జూలై 30 (జనంసాక్షి) : లోక్‌సభలో ప్రతిపక్ష ¬దాపై రాబోయే నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ సుమిత్రా మహాజన్ వెల్లడించారు. నిబంధనలు, అటార్నీ జనరల్ లేఖ ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష ¬దా ఎవరికి ఇవ్వాలన్న దానిపై స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఎలాంటి పక్షపాత ధోరణితో వ్యవహరించజాలరని పేర్కొన్నారు. నిబంధనలు, గత సంప్రదాయాలను పాటించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ‘నిబంధనలతో పాటు అటార్నీ జనరల్ లేఖను పరిశీలిస్తా. అందులో ఏముందో నాకు తెలియదు. సభాపతి ఏది పడితే అది చేయడానికి లేదు. నిబంధనల మేరకే ఎవరైనా వ్యవహరించాలి. మరో నాలుగు రోజుల్లోపే నిర్ణయం వస్తుందని’ తెలిపారు. గతంలో చాలాసార్లు ప్రతిపక్ష ¬దా ఇవ్వలేదని స్పీకర్ గుర్తు చేశారు. ‘చాలాసార్లు సభలో ప్రతిపక్ష పార్టీ లేదు. తొలిసారి 1969లో ప్రతిపక్ష ¬దా ఓ పార్టీకి దక్కింది. అంతకు ముందు ఏ పార్టీకి లోక్‌సభలో పది శాతం సీట్లు లభించలేదు. అలాగే, 1980, 1984లలో కూడా ప్రతిపక్ష పార్టీ లేదు’ అని అన్నారు. ఇప్పుడు కూడా ప్రతిపక్ష ¬దాకు అవసరమైన సంఖ్యాబలం లేదన్న సభాపతి.. చూద్దాం అని వ్యాఖ్యానించారు.ప్రతిపక్ష ¬దా దక్కించుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా యత్నిస్తోంది. సీవీసీ, సీఐసీ వంటి కీలక నియామకాల్లో ప్రతిపక్ష నేతకూ అవకాశం ఉండడంతో ఆ పార్టీ ప్రతిపక్ష ¬దా కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కానీ, ప్రతిపక్ష ¬దా దక్కాలంటే సభలో పదో శాతం సభ్యుల బలం ఉండాలి. అయితే, 543 మంది సభ్యుల లోక్‌సభలో కాంగ్రెస్ బలం 44 మాత్రమే. యూపీఏ మిత్రపక్షాలతో కలిపితే 56 మంది ఎంపీల మద్దతు ఉంది. ఈ నేపథ్యంలోనే తమకు ప్రతిపక్ష ¬దా ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. గతంలో పది శాతం సభ్యుల బలం లేదని కాంగ్రెస్ పలుమార్లు విపక్షాలకు ప్రతిపక్ష ¬దా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా కాంగ్రెస్‌కు ఆ ¬దా ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. దీంతో వివాదం ముదిరింది. దీనిపై సభాపతి అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని కోరారు. ప్రతిపక్ష ¬దా ఇచ్చేందుకు కాంగ్రెస్‌కు అర్హత లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.