మహబూబ్‌నగర్‌ జిల్లా నీటి ప్రాజెక్టులపై కేసీఆర్‌ సీరియస్‌

5
నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం

పారిశ్రామిక విధానంపై సిఎం కసరత్తు

హైదరాబాద్‌, జూలై30 (జనంసాక్షి): పాలమూరు ఎత్తిపోతల పథకం, జూరాల- పాకాల ప్రాజెక్టు పనులకు సంబంధించి సర్వే నిర్వహించి పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ఈ రెండు ప్రాజెక్టులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. బుధవారం సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి అరవింద్‌రెడ్డితో సీఎం సమావేశమై సవిూక్ష నిర్వహించారు. ఈ రెండు ప్రాజెక్టుల సర్వే పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సెప్టెంబరులో ప్రవేశపెట్టే బ్జడెట్‌లో నిధులు సైతం మంజూరు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి 5.73 కోట్లు, జూరాల పాకాల ప్రాజెక్టుకు 3.3 కోట్లు సర్వే పనుల కోసం విడుదల చేశారు. పాలమూరు సర్వే పనులను ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీకి, పాకాల పనులను వ్యాప్‌కోకు అప్పగించారు. రెండు నెలల్లోగా సర్వే నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. పాలమూరు ఎత్తిపోతల పథక , జూరాల-పాకాల ప్రాజెక్టు పనులకు సంబంధించిన సర్వే నిర్వహించి డిపిఆర్‌ సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిచ్చే ప్రాజెక్టులలో ఈ రెండు ప్రాజెక్టులు ముందు వరుసలొ వుంటాయని ఇదివరకే సీఎం ప్రకటించారు.ఈ రెండు ప్రాజెక్టులను చాలా వేగంగా పూర్తిచేయాలని, సెప్టెంబర్‌ లో ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో నిధులు కూడా మంజూరు చేయాలని కేసిఆర్‌ నిర్ణయించారు. సర్వే నిర్వహించి నివేదిక సమర్పించేందు కోసం రెండు నెలల గడువు ఇచ్చారు. జూరాల వరద నీటిన మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి , పల్గొండ జిల్లాలకు తరలించేందుకు పాలమూరు ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. జూరాల నుంచి 70టిఎంసిల నీటిని షాద్‌నగర్‌ మండలం లక్ష్మీదేవిపల్లిలోని ఎత్తైన ప్రాంతానికి ఎత్తిపోసి అక్కడినుండి భూమ్యాకర్షణ శక్తి ద్వారా క్రింది ప్రాంతాలకు

తరలించాలనేది, మధ్యలో మహబూబ్‌పగర్‌-నల్లగొండ జిల్లాల మద్య ఉన్న మిడ్‌ డిండి రిజర్వాయర్‌ను కూడా కలుపుకోవాలన్నది ఈ పథకం లక్ష్యం. మహబూబ్‌పగర్‌ జిల్లాలో 7లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 2. 70 లక్షల ఎకరాలు, నల్గొండలో 30వేల ఎకరాలకు నీరు అందించవచ్చనేది ప్రాథమిక అంచనా. ఈ పథకాన్ని మరింత విస్తరించి హైదరాబాద్‌ తాగునీటి అవసరాలు కూడా తీర్చాలని ప్రభుత్వం ఉద్దేశ్యం. మహబూబ్‌పగర్‌ జిల్లా జూరాల నుండి వరంగల్‌ జిల్లా పాకాల వరకు దాదాపు 400 చెరువులను నింపుతూ మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్‌ జిల్లాలో చెరువుల కింద సాగవుతున్న భూమిని స్థిరీకరించేందుకు జూరాల-పాకాల ప్రాజెక్టును నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. జూరాల నుండి 60 నుండి 70టిఎంసిల నీటిని గ్రావిటి ద్వారా పాకాల దాకా తీసుకువచ్చేందుకు ఈ పథకానికి, రూపకల్పన చేశారు. దాదాపు 400 కిలోవిూటర్ల మేర నీటి ప్రవాహం ఉండేందుకు గొలుసుకట్టు చెరువులను ఆధారం  చేసుకుని ఈ ప్రాజెక్టు పని చేస్తుందని అంచనా వేస్తున్నారు.

పారిశ్రామిక విధానంపై సిఎం కసరత్తు

కొత్త పారిశ్రామిక విధానంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో విధానం ప్రకటించేందుకు వీలుగా ఆయన బుధవారం నాడిక్కడ  సమీక్ష జరిపారు. ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో పారిశ్రామిక విధానం ప్రకటించే అవకాశం ఉంది. సింగిల్‌ విండో పద్దతి ద్వారా పరిశ్రమలకు త్వరగా అనుమతులు లభిస్తాయని, ముఖ్యమంత్రి అధీనంలో చేజింగ్‌ సెల్‌ ఉంటుందని కేసీఆర్‌ తెలిపారు. పరిశ్రమలకు మౌలిక వసతుల కల్పనకు 2లక్షల ఎకరాలు కేటాయించనున్నారు. నూతన పారిశ్రామిక విధానంపై సుదీర్ఘంగా సిఎం  సవిూక్ష జరిపారు. పరిశ్రమల స్థాపనకు సింగిల్‌విండో ద్వారా అనుమతులు మంజూరు చేస్తామని సీఎం తెలిపారు. తన అధీనంలోనే చేజింగ్‌ సెల్‌ ఉంటుందని స్పష్టం చేశారు. పరిశ్రమలకు మౌలిక వసతుల కల్పనకు రాష్ట్రంలో రెండు లక్షల ఎకరాల భూమి సిద్ధంగా ఉందని వెల్లడించారు. కాగా, రెండుమూడ్రోజుల్లో ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే పారిశ్రామికవేత్తలతో నేరుగా సమావేశమయ్యారు. అలాగే వారినుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. ఆ తరవాత ఇప్పుడు విధివిధానాలు ప్రకటించే క్రమంలో కసరత్తు చేశారు.