ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన సుహాగ్
న్యూఢిల్లీ, జూలై 31 (జనంసాక్షి) : కొత్త ఆర్మీ చీఫ్‌గా జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. పదవీ విరమణ చేసిన జనరల్ బిక్రమ్‌సింగ్ నుంచి ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. 1.3 మిలియన్ల సైనికులకు అధిపతిగా సుహాగ్ 30 నెలల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. సౌత్ బ్లాక్‌లోని తన కార్యాలయంలో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ బాటన్ స్వీకరించారు. ఆర్టిలరీ, ఇన్‌ఫ్యాంట్రీ, ఎయిర్ డిఫెన్స్ ఆర్మ్స్ వంటి సవాళ్ల నేపథ్యంలో సుహాగ్ బాధ్యతలు చేపట్టారు. 59 ఏళ్ల జనరల్ సుహాగ్ కుటుంబమంతా సైనికులే. ఆయన తండ్రి రాజ్‌పాల్‌సింగ్ సుహాగ్ ఫ్లైయింగ్ ఆఫీసర్‌గా పని చేసి రిటైర్డ్ అయ్యారు. తమ గ్రామానికి చెందిన వ్యక్తి ఆర్మీ చీఫ్ స్థాయికి ఎదగడంతో హర్యానాలోని జజ్జర్ గ్రామం సంబరంగా పండుగ చేసుకుంది. చిత్తోర్‌గఢ్ సైనిక్ స్కూల్‌లో చదివిన సుహాగ్ 1970లో జాతీయ రక్షణ దళం (ఎన్డీయే) లో చేరారు. 1987లో శ్రీలంలకో బారత శాంతిస్తాపక దళంలో పని చేశారు. ఇప్పటివరకు ఆర్మీ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన 26 భారత ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు.