ముజాఫర్ అలీకి రాజీవ్ సద్భావనా అవార్డు
హైదరాబాద్, ఆగస్టు 1 (జనంసాక్షి) ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత, ఫ్యాషన్ డిజైనర్, కవి, కళాకారుడు ముజఫర్ అలీకి రాజీవ్‌గాంధీ నేషనల్ సద్భావన అవార్డు లభించింది. ఉమ్రావ్‌జాన్, గమన్, ఆగమన్, సునహరే సప్నే, టుగెదర్ ఫరెవర్, అంజుమన్ లాంటి పలుచిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన కుమారుడు షాద్ అలీ కూడా చలన చిత్ర దర్శకుడిగా పనిచేస్తున్నారు. ముజఫర్ అలీ లక్నోకి చెందిన ముస్లిం రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి రాజా ఆఫ్ కొట్వారాగా పేరొందారు.