పోలీసులకు అత్యాధునిక ఆయుధాలు
కాల్పుల ఘటనాస్థలాన్ని పరిశీలించిన ¬ంమంత్రి
హైదరాబాద్, ఆగస్టు 2 (జనంసాక్షి) : పోలీసులకు అత్యాధునిక ఆయుధాలు అందజేస్తామని ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కాల్పుల ఘటనాస్థలాన్ని ఆయన శనివారం పరిశీలించారు. దొంగ నోట్ల ముఠా సభ్యులను పట్టుకోవడంలో ధైర్యాన్ని ప్రదర్శించిన పోలీసులను ఆయన అభినందించారు. దొంగల దాడిలో మృతిచెందిన కానిస్టేబుల్ ఈశ్వర్రావు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హావిూఇచ్చారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకొని కఠిన శిక్షలు పడేలాచూస్తామని చెప్పారు. పోలీసులకు అధునాతన ఆయుధాలిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో అసాంఘిక కార్యకలాపాల నివారణకు నగర వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తామన్నారు. శావిూర్‌పేట మండలం మాజిద్‌పూర్ వద్ద పోలీసులపై దొంగలు దాడిచేసిన ఘటనలో ఎస్సై వెంకటరెడ్డి, కానిస్టేబుల్ ఈశ్వర్రావు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈశ్వర్రావు చికిత్స పొందుతూ మృతి చెందగా, ఎస్సై యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈశ్వర్రావు మృతదేహాన్ని ¬ం మంత్రి నాయిని శనివారం ఉదయం సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న ఎస్సై వెంకటరెడ్డిని నాయిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాల్పుల ఘటన స్థలాన్ని నాయిని పరిశీలించారు. ఈ సందర్భంగా కాల్పులు జరిగిన తీరును సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ¬ం మంత్రికి వివరించారు. అనంతరం నాయిని విూడియాతో మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానిస్టేబుల్ ఈశ్వర్రావు, ఎస్సై వెంకటరెడ్డి ధైర్య సాహసాలను ఆయన కొనియాడారు. ఈశ్వర్రావు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. ఈశ్వర్రావు మృతదేహాన్ని విమానంలో స్వస్థలానికి పంపిస్తామన్నారు. నేరస్తుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. వీలైనంత త్వరలో నిందితులను పట్టుకొని కఠిన శిక్షలు పడేలా చూస్తామని స్పష్టం చేశారు. ఎస్సై వెంకటరెడ్డికి యశోద ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరుగుతోందని, ఆయన పూర్తిగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తంచేశారు. ఆయన వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందన్నారు.
ఎల్లంగౌడ్ ముఠా పనే !
శావిూర్‌పేటలో పోలీసులపై కత్తులతో దాడిచేసిన దొంగల ముఠా సిద్దిపేట ఎల్లంగౌడ్ గ్యాంగ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. నకిలీ నోట్ల ముఠానే పోలీసులపై దాడికి పాల్పడిందని కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ దాడి వెనుక ఎల్లంగౌడ్ హస్తం ఉందని అనుమానిస్తున్నామన్నారు. ఘటనా స్థలంలో రూ.1.50లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. సిద్దిపేటలో నకిలీ నోట్లు ముద్రిస్తున్నారని, కరీంనగర్ కేంద్రంగా నకిలీ నోట్లను చెలామణి చేస్తున్నారని తెలిపారు. రెండు నెలల క్రితమే ఎల్లంగౌడ్ జైలు నుంచి విడుదలయ్యాడని చెప్పారు. మారుతీ స్టిఫ్ట్‌లో వచ్చిన ఐదుగురు సభ్యుల ముఠా శావిూర్‌పేట మండలం మజీద్‌పూర్ చౌరస్తా సవిూపంలోని బావర్చి ¬టల్ వద్ద పోలీసులపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఇది ఎల్లంగౌడ్ ముఠా పనేనని పోలీసులు భావిస్తున్నారు. సిద్దిపేటలో ఈ గ్యాంగ్‌పై పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఐదుగురు సభ్యుల ముఠాలో ఒకరు పోలీసుల కాల్పుల్లో చనిపోగా, నలుగురు పరారయ్యారు. వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తిని సిద్దిపేటకు ముస్తఫాగా గుర్తించారు. అతనిపై సిద్దిపేటలో చాలా కేసులు నమోదయ్యాయి.