ఇద్దరు చంద్రుల కరచాలనం
బేగంపేట విమానాశ్రయంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం
హైదరాబాద్,ఆగష్టు2: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వచ్చిన సందర్భంగా ఇద్దరు సిఎంలు ఒక్కటయ్యారు. బేగంపేట విమానాశ్రయంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. ఉమ్మడి రాజధాని కావడంతో హైదరాబాద్‌లో ఉంటున్నా కెసిఆర్ చంద్రబాబు ఎడమొహంపెడమొహంగా ఉన్నారు. శనివారం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. శనివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఇక్కడకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు, ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. నగరంలో జరిగే నల్సార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ప్రణబ్ ముఖర్జీ పాల్గొనేందుకు హైదారబాద్ వచ్చారు. దీంతో ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చిన సమయంలో విమానాశ్రయంలో చంద్రబాబు, కేసీఆర్ పరస్పరం పలకరించుకున్నారు. కేసీఆర్, చంద్రబాబులు సీఎం ¬దాలో తొలిసారిగా శనివారం కలుసుకున్నారు. నల్సార్ విశ్వవిద్యాలయంలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి స్వాగతం పలికేందుకు వీరిరువురు గవర్నర్ నరసింహన్‌తో పాటు బేగంపేట విమానాశ్రయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఒకరికొకరు కరచాలనం చేసుకుని పలకరించుకున్నారు. చంద్రబాబు కేసీఆర్ భుజంతట్టి అభినందించారు. రాష్ట్రం విడిపోయిన తరవాత ఆంధప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖర రావు కరచాలనం చేసుకోవడం లేదా ఎదురెదురు పడడం ఇదే ప్రథమం. వారి ఇద్దరి చేతులను గవర్నర్ నరసింహన్ కలిపి పట్టుకున్నారు. ముఖ్యమంత్రుల ¬దాలో ఇద్దరూ కలవడం ఇదే మొదటిసారికావడం విశేషం. ఇద్దరూ తప్పనిసరిగా కలవవలసిన అవసరం ఏర్పడింది. పాత మిత్రులైన ఇద్దరూ చాలా కాలం తరువాత కలిశారు.
ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసిన సందర్భంగా గవర్నర్ నరసింహన్‌తోపాటు ముగ్గురూ ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించారు. చంద్రబాబు నాయుడు కెసిఆర్ భుజం తట్టి నవ్వుతూ మాట్లాడారు. గవర్నర్ ఇఫ్తార్ విందుకు ఆహ్వానించినా కెసిఆర్ ఆ రోజు రాలేదు. అందువల్ల ఆరోజు వీరు కలవలేకపోయారు. చంద్రబాబు నాయుడు, కెసిఆర్‌లను కలపడంలో గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు రాష్టాల్ర మధ్య సమన్వయం చేకూర్చడానికి వెంకయ్య నాయుడు ఇక్కడకు వచ్చారు. ఇద్దరు ముఖ్యమంత్రులను ఆయన కలిశారు. ఆ తరువాత వీరిద్దరూ ఇలా కలవడం శుభసూచకంగా భావిస్తున్నారు. సమస్యలు ఉంటే కలసి చ్చించుకోవాలని ఇప్పటికే వెంకయ్య సలహా ఇచ్చారు.