చైనాలో భారీ భూకంపం
12వేల ఇళ్లు నేలమట్టం
దెబ్బతిన్న 30వేల గృహాలు
రిక్టర్‌స్కేల్‌పై 6.5గా నమోదు
న్యూఢిల్లీ, ఆగస్టు 3 (జనంసాక్షి) : చైనాలో భారీ భూకంపం సంభవించింది. చైనా వాయూవ్య ప్రాంతంలోని యునాన్ రాష్ట్రం వెన్‌పింగ్‌లో తీవ్ర ప్రకంపనలు సంభవించాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 175 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇప్పటికే 12వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. 30వేల గృహాలు దెబ్బతిన్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదైనట్లు భూగర్భ శాస్త్రవేత్తలు వెల్లడించారు. యునాన్‌లోని లాంగటౌషన్ వద్ద భూ ప్రకంపనలు సంభవించాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా 1970లో యునాన్‌లో సంభవించిన భూకంపంలో దాదాపు 15వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా నేటి ఘటనలో 175 మంది దుర్మరణం పాలయ్యారు. దీంతో వాయువ్య ప్రాంతంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.