పాఠశాలల్లో గీతా బోధిస్తారా?

3

జస్టిస్‌ దావే వ్యాఖ్యలు పెను ప్రమాదం

లౌకిక పునాదులకు విఘాతం

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం : జస్టిస్‌ మార్కండేయ కట్జూ

న్యూఢిల్లీ, ఆగస్టు 3 (జనంసాక్షి) : పాఠశాలల్లో గీతా బోధిస్తారా అని జస్టిస్‌ దావే వ్యాఖ్యలను ప్రెస్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ మార్కండేయ కట్జూ ప్రశ్నించారు. తనకి అవకాశమిస్తే పిల్లలకు పాఠశాల దశనుంచే భగవద్గీత, మహాభారతాలు బోధించేలా చూస్తానన్న న్యాయమూర్తి ఏఆర్‌.దవే మాటలను కట్జూ ఖండించారు. అహ్మదాబాద్‌లో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ జస్టిస్‌ ఏఆర్‌ దవే తనని సెక్యులర్‌ అన్నా, కాదన్నా పట్టించుకోనన్నారు.  భారత్‌లాంటి లౌకికరాజ్యంలో అలాంటి ప్రయోగం మేలుకన్నా కీడే ఎక్కువ చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దవే వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. మంచి ఎక్కడ ఉన్నా తీసుకోవాలన్న ఆయన తానే కనక నియంతనైతే పిల్లలకు చిన్నవయసునుంచే మన వారసత్వాన్ని అందించేలా పాఠ్యపుస్తకాలు మారుస్తానన్నారు. జస్టిస్‌ దవే వ్యాఖ్యల్ని తాను ఖండిస్తున్నానని, ఆయన అభిప్రాయంతో తాను ఏకీభవించనని పేర్కొన్నారు. భిన్నత్వానికి నిలయమైన ఈ దేశంలో ఓ మతానికి చెందిన అంశాలు పాఠ్యపుస్తకాల్లో ఉంటే మిగిలినవారు ఎలా ఆమోదిస్తారని ఆయన ప్రశ్నించారు.