గ్రేటర్‌ గెలుచుకోవాలి

44A

హైదరాబాద్‌ నేతలతో సిఎం సమావేశం

గోడదూకనున్న వైకాపా నేతలు

గట్టు రాంచందర్‌, జనక్‌ప్రసాద్‌, విజయారెడ్డి కేసీఆర్‌తో భేటీ

మెదక్‌, ఆగస్టు 3 : గ్రేటర్‌ హైదరాబాద్‌ను చేజిక్కిచ్చుకునేందుకు స్థానిక నేతలు కృషిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు టిఆర్‌ఎస్‌ నేతలకు సూచించారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ ఎంపీ కేశవరావు నివాసంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలపై ఆయన  సవిూక్ష జరిపారు. డిప్యూటీ సీఎం మహ్మద్‌ ఆలీ, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కేకే నివాసంలో వైసీపీకి చెందిన గట్టు రామచంద్రరావు, జనక్‌ ప్రసాద్‌, విజయారెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిసారు. గత కొంతకాలంగా వీరిద్దరు పాక్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ అధినేత తీరు వీరికి నచ్చకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. త్వరలోనే ఈ ఇద్దరు నేతలు కారెక్కనున్నట్లు సమాచారం.

అంతకు ముందు క్యాంప్‌ కార్యాలయంలో కేసీఆర్‌తో డీజీపీ అనురాగ్‌ శర్మ, ఇతర ఉన్నతాధికారులు సమావేశమై మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ పోలీసు వాహనాలను పరిశీలించిన కేసీఆర్‌ పోలీసులు వినియోగించే ఇన్నోవా వాహనాల డిజైన్‌ కలర్‌ లోగోను మార్చాలని ఆదేశించారు.