పరిశ్రమలకు కోత విధించండి

2
రైతులకు 6గంటలు కరెంటివ్వండి

పోలీసుల లాఠీఛార్జీపై కేసీఆర్‌ సీరియస్‌

విచారణకు ఆదేశం, ఇద్దరు అధికారుల బదిలీ

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 4 (జనంసాక్షి ) : పరిశ్రమలకు కోత విధించైనా రైతులకు 6గంటలు కరెంటివ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. మెదక్‌ జిల్లా నార్సింగి వద్ద విద్యుత్‌ కోతలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన రైతులపై పోలీసులు లాఠీలు ఝులిపించిన ఘటనపై సిఎం కెసిఆర్‌ తీవ్రంగా స్పందించారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించిన ఆయన ఇద్దరు అధికారుల బదిలీకి ఆదేశించారు. రైతులపై లాఠీఛార్జ్‌ విషయంలో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ సమస్యకు విద్యుత్‌ కారణం కావడంతో వెంటనే విద్యాత్‌ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించారు.  రైతులకు ఇబ్బంది లేకుండా 6 గంటలు కరెంట్‌ సరఫరా చేయాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమలకు కోత విధించైనా సాగుకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. అలాగే విద్యుత్‌ సరఫరాలో నిర్లక్ష్యం వహించిన విద్యుత్‌ అధికారులపై చర్యకు ఆదేశించారు. అంతకుముందు సిఎం కెసిఆర్‌ మంత్రులు పోచారం, తదితరులలో సవిూక్షించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతుల ఆందోళపై స్పందించారు. మెదక్‌  జిల్లా నార్సింగి వద్ద ఈ ఉదయం విద్యుత్‌ కోతలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన రైతులపై పోలీసుల లాఠీఛార్జి దురదృష్టకరమని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. కరెంట్‌ కోతల విషయంలో సాంకేతిక సమస్యల వల్ల కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. రైతులపై జరిగిన లాఠీఛార్జి ఘటనపై సీఎం కేసీఆర్‌ సవిూక్షించారని తెలిపారు. అయితే విద్యాఉత్‌ సమస్య ఉందని, అయితే స్థానిక అధికారులు సవిూక్షించి తగిన నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదన్నారు. రైతుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు. రైతులకు అన్యాయంజరిగితే సహించబోమన్నారు. అయితే విద్యుత్‌ సమస్యను కొందరు రాజకీయంగా ఉపయోగించుకోవడం దారుణమన్నారు. కొందరు దీనిని పెద్దిగా చేసి రాజకయీ స్వలాభం కోసం పాకులాడేఉ ప్రయత్నం చేశారన్నారు. ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందన్నారు. విద్యుత్‌ కొనుగోలుకు సర్కార్‌ ప్రయత్నాలు చేపట్టిందన్నారు, కనీసం 7గంల విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.  మరోవైపు  విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. చేగుంట ఏఈ పెంట్యా నాయక్‌ని సస్పెన్షన్‌ చేయగా, రామాయంపేట ఏడీఈ శ్రీనివాస్‌రెడ్డిని బదిలీ చేశారు.