ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా పాపిరెడ్డి

5
వరంగల్‌, ఆగస్ట్‌ 5 (జనంసాక్షి) : తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా తనను నియమించడం ఆనందంగా ఉందని కాకాతీయ మాజీ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్‌లో ఆయన మాట్లాడుతూ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ విషయంలో తెలంగాణ విద్యార్థులు అధైర్యపడొద్దని సూచించారు. తెలంగాణ విద్యార్థులకు ఎక్కడా అన్యాయం జరుగనీయబోమన్నారు. అలాగే అందరికీ ఫీజుల చెల్లింపు జరగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ భరోసాతో ఉండాలన్నారు. ఏపీ ప్రభుత్వం, మంత్రుల వాదనలు అవాస్తవమన్నారు. సుప్రీంకోర్టు తుదితీర్పు తర్వాత కౌన్సెలింగ్‌పై నిర్ణయం ఉంటుందన్నారు. ఈ విషయంలో సిఎం కెసిఆర్‌ తగిన నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు.