భారత సైనికాధికారి పతక్‌కుమార్‌పై దేశద్రోహం కేసు
దేశ రహస్యాలు పాక్‌కు చేరవేశాడని అభియోగాలు
హైదరాబాద్ ఆగస్టు 6 (జనంసాక్షి) : భారత సైనికాధికారి పతన్‌కుమార్‌పై హైదరాబాద్‌లో దేశద్రోహం కేసు నమోదైంది. దేశ రహస్యాలను పాక్‌కు చేరవేస్తున్నాడనే అభియోగాలతో ఆయనపై బుధవారం అధికారులు కేసు నమోదు చేశారు. బెంగాల్‌కు చెందిన ఆర్మీ ఉద్యోగి పతక్‌కుమార్ ఫేస్‌బుక్‌లో పాకిస్తాన్‌కు చెందిన అనుష్క అగర్వాల్‌తో చాటింగ్ చేసేవాడు. తన నగ్న చిత్రాలు పంపిస్తే ఆర్మీ అధికారుల పోన్ నెంబర్లు చెబుతానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతన్ని ట్రాప్‌లోకి దించేందుకు ఆ యువతి నగ్న చిత్రాలను పంపిది. పతన్‌కుమార్ కంటోన్మెంట్‌లో సుబేదార్ మేజర్‌గా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం అనుమతిలేకుండా చాటింగ్ చేసినందుకు ఆర్మీ అధికారిపై ఆర్మీ సిసిఎఎల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు కేసు నమోదుచేసి ఆర్మీ ఉద్యోగిని అరెస్టు చేశారు. భారత ఆర్మీ, జపాన్ టెక్నాలజీ, అమెరికా కరెన్సీ అని చాలా గొప్పగా చెప్పుకుంటున్న భారతీయులు ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. దేశ రక్షణ బాధ్యతలో ఉండి ఇలాంటి పనులు చేయడం దురదృష్టకరమని పలువురు వాపోతున్నారు. ఇలాంటి చర్యలపై వల్ల భారత రక్షణ వ్యవస్థపై సామాన్య మానవునికి నమ్మకం లేకుండాపోయే పరిస్థితి దాపురిస్తుంది.