దేశ రహాస్యాలు అమ్మేశా

3
74వేలకే 40మంది అధికారుల కదలికలు అందజేశా

దేశద్రోహి పతక్‌ నేరంగీకారం

హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి) : దేశ రహాస్యాలను అమ్మేశానని దేశద్రోహి పతక్‌ నేరాన్ని అంగీకరించాడు. 74వేలకే 40మంది అధికారుల కదలికలు అందజేశానని చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా పోలీసులకు ఇచ్చిన నేరాంగీకార వాంగ్మూలంలో ఒప్పుకున్నాడు. అనుష్క అగర్వాల్‌ అనే మహిళ పేరుతో ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తికి ఇలా దేశ రహస్యాలను అమ్మేసిన పతన్‌ 96 ఫీల్డ్‌ రెజిమెంట్‌లు, 10 విూడియమ్‌ రెజిమెంట్‌ల సమాచారాన్ని చిటికెలో అమ్మేశాడు. తనతో ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి అసలు నిజంగానే మహిళ లేక పురుషుడు అయ్యుండవచ్చా అన్న అనుమానం పతన్‌కు రానేలేదు. ఈయన మల్టీ మార్కెటింగ్‌ కూడా చేస్తున్నాడు. ఈ విషయం కూడా తన వాంగ్మూలంలో వివరించాడు. సైన్యంలో పనిచేస్తున్న వ్యక్తులకు ముందే ఎంతో కఠినమైన శిక్షణ ఉంటుంది. దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించి చాలా జాగరూకతతో ఉండాలని కూడా చెబుతారు. అయినా 40 మంది అధికారుల కదలికల గురించి కూడా సమాచారం ఇచ్చేశాడు. కేవలం ఒక మహిళ ఫొటోలు పంపిస్తుండడంతో ఒళ్లు మైమరిచిపోయిన పొద్దర్‌ క్షిపణి కేంద్రాల సమాచారం కూడా ఇచ్చేశాడు. అనుష్క తన తండ్రి సైన్యంలో పనిచేస్తున్నారని పతన్‌తోతో నమ్మబలికింది. తానో రీసెర్చర్‌నని కూడా ఆమె పరిచయం చేసుకుంది. తండ్రి సైన్యంలో పనిచేస్తున్నారని చెప్పిన వ్యక్తి ఇలా అసభ్యకరమైన చిత్రాలను పంపించడమేమిటని గాని, కీలకమైన వ్యక్తుల సమాచారం, ఆయుధ తయారీ కర్మాగారాల సమాచారం అడగడం ఏమిటనిగాని ఈయనకు సందేహం రాలేదు. దేశ పశ్చిమ సరిహద్దులలో సైనికాధికారుల కదలికల గురించి కూడా అనుష్క అడిగిందే తడవుగా పొద్దర్‌ తనకు తెలిసిన సమాచారం మొత్తం ఇచ్చేస్తూనే ఉన్నాడు. సికింద్రాబాద్‌నుంచి జోధ్‌పూర్‌ వరకూ గల సైనిక స్థావరాలను కూడా అనుష్క సంపాదించింది. 2013 నుంచి ఫేస్‌బుక్‌లో తమ ఇద్దరి మధ్య ఇంత జరుగుతున్నా అనుష్క వెనుక శత్రువులు ఉన్నారేమోనన్న అనుమానం పొద్దర్‌కు లేశమాత్రమైనా కలగకపోవడం అధికారులకు విస్మయం కలిగిస్తోంది. పతన్‌ ద్వారా భారత సైన్యంలో కొందరు అధికారులకు సంబంధించిన కదలికల వివరాలు శత్రువుకు చేరిపోవడంతో వారి కదలికలను పూర్తిగా మార్చేశారు.