గోల్కొండ కోటే పంద్రాగస్టు వేదిక
హైదరాబాద్, ఆగష్టు7 (జనంసాక్షి) : పంద్రాగస్టు వేడుకలు గోల్కొండ కోటలోనే జరుగుతాయని డీజీపీ అనురాగ్‌శర్మ స్పష్టంచేశారు. రక్షణ శాఖతో ఉన్న వివాదం త్వరలోనే కొలిక్కి వస్తుందని చెప్పారు. ఇప్పటికే అక్కడ రిహార్సల్స్ చేపట్టామని అన్నారు. ఎక్కడా వివాదం లేదన్నారు. పంద్రాగస్టు వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు అక్కడ జరుగుతున్నాయని తెలిపారు. ప్రజలు, ప్రభుత్వానికి పోలీస్ వ్యవస్థపై నమ్మకం కలిగించాలని డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో సిబ్బంది విధులు నిర్వహించాలని చెప్పారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు 1500 ¬ంగార్డులు, 3,600 డ్రైవర్ పోస్టులు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.