సర్వేతో స్థానికతకు సంబంధంలేదు తెలంగాణ సర్కారు

3
హైదరాబాద్‌, ఆగస్టు8 (జనంసాక్షి) :

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 19న చేపట్టే సమగ్ర కుటుంబ సర్వేతో స్థానికతకు సంబంధం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. స్థానికత కోసమే దీనిని చేపట్టారన్న విమనర్శలు సరికాద న్నారు. ఈ నెల 19న సర్వేకోసం కుటుంబ సభ్యు లంతా తప్పనిసరిగా ఉండాలని, హైదరాబాద్‌ సహా అన్ని జిల్లాల్లో సర్వే జరుగుతుందని అధికారులు తెలిపారు. విదేశాలు, ఇతర రాష్టాల్రల్లో ఉన్నవారు రావాల్సిన అవసరం లేదన్నారు. ఈ సర్వే స్థానికత నిర్దారణకు కానీ, ఫాస్ట్‌ పథకం అమలుకు గానీ సంబంధంలేదని వెల్లడించారు. సర్వేకు విదేశాల్లో ఉన్నవారు, వేరే రాష్టాల్ల్రో ఉన్నవారు రావాల్సిన అవసరంలేదని, వాళ్లు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని విజ్ఞప్తి చేశాయి. విదేశాల్లో ఉన్న విద్యార్థులకు మినహాయింపు ఉంటుందని తెలిపారు. అయితే వీరికి సంబంధించిన ఆధారాలను విధిగా సర్వే అధికారికి చూపాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాల్లో సర్వే నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ప్రొఫార్మా అందుబాటులో ఉంచామని చెప్పారు.