మెదక్‌ జిల్లాలో హార్టికల్చర్‌ వర్సిటీ

5

ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయ స్థల పరిశీలనకు కేసీఆర్‌

మెదక్‌, ఆగస్టు 8 (జనంసాక్షి)  :

జిల్లాలో ఏర్పాటుచేయబోయే హార్టికల్చర్‌ వర్సిటీ నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ దృష్టిసారించారు. ఈమేరకు శుక్రవారం ఆయన మెదక్‌ జిల్లా ములుగులో యూనివర్సిటి ఏర్పాటు కోసం స్థల పరిశీలన జరిపారు. తన వ్యవసాయ క్షేత్రంలో జిల్లా అధికారులతో కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హార్టికల్చర్‌ వర్సిటీ కోసం 500 ఎకరాలు, అటవీశాఖ పరిశోధన కేంద్రం కోసం 400 ఎకరాలు కేటాయించాలని ఆదేశించారు. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ యూనివర్శిటీ వల్ల విద్యార్థులకు ఎంతో మేలు చేకూరనుంది. హార్టికల్చర్‌ యూనివర్సిటీ లేక ఎన్నో ఏళ్ళుగా విద్యార్థులు సంబంధిత విద్యకు దూరమవుతున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్ళి విద్యనభ్యసించలేని వారికి ఈ యూనివర్సిటీ వల్ల ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది. వ్యవసాయంపై మక్కువ ఉన్న కేసీఆర్‌ ఈ యూనివర్సిటీని ఎంతో ఉన్నతంగా నెలకొల్పుతాడనే నమ్మకం తెలంగాణ ప్రజల్లో ఉంది.