ముస్లింలకు కళ్యాణ లక్ష్మీ
హైదరాబాద్ కబ్జాపై సుప్రీంకోర్టుకెళ్తాం
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ
వరంగల్, ఆగస్టు 10 (జనంసాక్షి) : ముస్లింలకు కళ్యాణలక్ష్మీ పథకాన్ని వర్తింపజేస్తామని డిప్యూటీ సిఎం మహమ్మద్ అలీ అన్నారు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు. ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రాసిన లేఖకు కేంద్రం నుంచి వచ్చిన స్పందన ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని ఆలీ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, కేబినెట్‌లో చర్చిస్తామని, అందరి అభిప్రాయాలు తీసుకుని సుప్రీంకోర్టు వెళతామని అన్నారు. ప్రస్తుతం ఉన్న గవర్నర్‌కు సహకరిస్తామని అయితే రెండు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లు ఉంటే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. అడుగడుగునా తెలంగాణపై ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. సీమాంధ్ర పాలకుల ఒత్తిడికి తలొగ్గి తెలంగాణ ప్రభుత్వ హక్కులను హరించాలని చూస్తే ఊరుకోబోమన్నారు.