ఎంసెట్‌ మేమే నిర్వహిస్తాం

2
జెఎన్‌టియు మా పరిధిలోనే

ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : ఎంసెట్‌ తామే సొంతంగా నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి అన్నారు. ఒకట్రెండు రోజుల్లో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) స్పష్టంచేసింది. ఇవాళ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో మండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ను తామే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఎంసెట్‌ను నిర్వహించిన జేఎన్‌టీయూ తమ పరిధిలోనే ఉందని పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌ నిర్వహణపై ఏపీ ఉన్నత విద్యా మండలితో మాట్లాడతామన్నారు.