తెలంగాణ రాష్ట్రం అతిపెద్ద మార్కెట్‌

3

పెట్టుబడులకు ముందుకొచ్చిన కోకకోలా

హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం అతిపెద్ద మార్కెట్‌ అని కోకకోలా కంపెనీ ప్రతినిదులు అన్నారు. రాష్ట్రంలో వెయ్యికోట్ల పెట్టుబడులు పెట్టడానికి కోకకోలా కంపెనీ ముందుకొచ్చింది. ఈ మేరకు సోమవారం సచివాలయంలో ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ప్రెసిడెంట్‌ ఇరిగెన్‌ పిన్నాన్‌ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం అతిపెద్ద మార్కెట్‌ అని, ఇక్కడ పెట్టుబడులు పెట్టడంతో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్లాంట్‌ను ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్లు పిన్నాన్‌ కేసీఆర్‌కు వివరించారు. తాము పెట్టబోయే ప్లాంట్‌కు ప్రభుత్వ మద్దతు కోరారు. ఈ సందర్భంగా సిఎం స్పందిస్తూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన కోకకోలా కంపెనీని అభినందించారు. అందుకు ప్రభుత్వం తరఫున అన్ని సదుపాయాలను కల్పిస్తామని హామీనిచ్చారు. అదేవిధంగా అధాని గ్రూప్‌ కంపెనీ 20వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిచేసే ప్లాంట్‌ను నెలకొల్పడానికి ముందుకొచ్చింది. కంపెనీ చేసే విద్యుత్‌ సింగిల్‌విండో విధానం ద్వారా చేస్తే బాగుంటుందని కేసీఆర్‌ సూచించారు.