తెలంగాణ పోలీస్ లోగో ఆవిష్కరించిన సిఎం
హైదరాబాద్, ఆగస్ట్ 12 (జనంసాక్షి) : తెలంగాణ పోలీస్ కొత్త లోగోను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగశర్మతోసహా పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. పోలీస్ లోగోను డిజైన్ చేసిన ఏలే లక్ష్మణ్‌ను సీఎం సన్మానించారు. తొలుత లోగోను ఆవిష్కరించాక, లోగోను డిజిపికి తొడిగారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డికి తొడిగారు. అంతుకు ముందు పోలీసులు ఉన్నతాధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సవవేశమయ్యారు. డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పంద్రాగస్ట్‌తో పాటు వివిధ అంశాలను చర్చించారు.