సర్వే స్వచ్ఛందమే
హైదరాబాద్, ఆగస్ట్ 14 (జనంసాక్షి) : ఈ నెల 19న తెలంగాణలో చేపట్టనున్న కుటుంబ సర్వే స్వచ్ఛందంగానే నిర్వహిస్తున్నామని ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో సమగ్ర సర్వేకు హైకోర్టు ఓకే చెప్పింది. కొందరు దీనిని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజలు పాల్గొనడం తప్పనిసరికాదని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. సర్వేలో పాల్గొనడం, పాల్గొనకపోవడం ప్రజల ఇష్టమని కోర్టుకు తెలంగాణ అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి తాము చొరబడడం లేదని కూడా స్పష్టంచేశారు. సంక్షేమ పథకాల అమలు కోసమే సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. వాదనలు విన్న తర్వాత సమగ్ర సర్వేకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. స్వచ్ఛందంగా సర్వే నిర్వహించుకుంటే అభ్యంతరం లేదని పేర్కొంది. వ్యక్తిగత వివరాలు అడిగి ఇబ్బంది పెట్టొద్దని హైకోర్టు సూచించింది. దీంతో 19న సర్వేకు మార్గం సుగమమయ్యింది. అయితే దీనిలో పాల్గొన్న వారి వివరాల మేరకే ప్రభుత్వం ముందుకు వెళుతుంది కనుక ప్రతిఒక్కరూ ఇందులో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సర్వేలో లేకుంటే పథకాలు అందవేమో అన్న భయం ఎలాగూ ఉంది. సర్వే చేయొద్దని, సర్వే సమయంలో ప్రజలపై ఒత్తిడి తేవొద్దని హైకోర్టు స్పష్టంచేసింది. అందుకే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఐచ్ఛికమన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు అంగీకరించింది. వ్యక్తిగత వివరాలు అడిగి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని, సర్వేలో పాల్గొనాలా, వద్దా అనేది ప్రజల ఇష్టమని హైకోర్టు పేర్కొంది. ఈ కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.ప్రభుత్వం చేపట్టిన సర్వే న్యాయసమ్మతం కాదని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం గురువారం ఇరుపక్షాల వాదనలు వింది. సమగ్ర సర్వే తప్పనిసరి కాదని తెలంగాణ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. సర్వే స్వచ్ఛందంగానే నిర్వహిస్తున్నామని, సంక్షేమ పథకాల అమలు కోసమే సర్వే నిర్వహిస్తున్నామని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి తెలిపారు. పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడడం లేదన్నారు. ప్రజాసంక్షేమం కోసమే సర్వే అని చెప్పారు. బ్యాంకు, తపాలా ఖాతాలు, మొబైల్ నంబరు లాంటివి ప్రజల వ్యక్తిగత వివరాలని, వాటిని ప్రభుత్వం అడగకూడదని పిటిషనర్ తరఫ న్యాయవాది హైకోర్టులో వాదించారు. గణాంకాల చట్టం ప్రకారం సర్వేకు ముందు ప్రకటన ఇవ్వాలన్నారు. పన్నుల విధింపు, ప్రాసిక్యూషన్‌కు సర్వే వివరాలు ఇవ్వకూడదన్నారు. సర్వే వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయరాదని పిటిషనర్ తరఫున్యాయవాది పేర్కొన్నారు. బ్యాంకు, తపాలా ఖాతాలు, మొబైల్ నెంబరు లాంటివి ప్రజల వ్యక్తిగత వివరాలని, వాటిని ప్రభుత్వం అడగకూడదని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్రసర్వేపై పిటిషనర్ వాదనలు విన్పిస్తూ ఆయన గణాంకాల చట్టం ప్రకారం సర్వేకు ముందు ప్రకటన ఇవ్వాలన్నారు. పన్నుల విధింపు, ప్రాసిక్యూషన్‌కు సర్వే వివరాలు ఇవ్వకూడదన్నారు.