భారత్‌ బలమైన ప్రజాస్వామ్య దేశం

4

ఓటింగ్‌ శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం

జాతినుద్దేశించి ప్రసంగంలో రాష్ట్రపతి

న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి) : భారత్‌ బలమైన ప్రజాస్వామ్య దేశమని,

ఓటింగ్‌ శాతం పెరగడమే ఇందుకు నిదర్శనమని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు.  దేశ ప్రజలకు ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన దూరదర్శన్‌లో జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరగడం మన ప్రజాస్వామ్యం బలోపేతానికి నిదర్శనమన్నారు. ఇటీవల జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు ఆయన అభినందనలు తెలిపారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలన్నారు. 12వ పంచవర్ష ప్రణాళిక ముగిసేలోగా 80 శాతం అక్షరాస్యత సాధించాలని కోరారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా జాతి వికసించాలని, ఆర్థికఫలాలు కిందిస్థాయిలో వున్నవారికి చేరాలని ఆకాంక్షించారు.  2019లో జరిగే మహత్మాగాంధీ 150వ జయంతి నాటికి పరిశుద్ధభారత్‌ను సాధించాలన్నారు.

పార్టీలు, రాజకీయాలకతీతంగా జాతి ఔన్నత్యం వికసించాలని ప్రణబ్‌ ఆకాంక్షించారు. ప్రశాంతత లేకుండా సామాజిక, ఆర్థిక ప్రగతి సాధించలేమని  అన్నారు. దేశంలో మూడో వంతు ప్రజలు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారని తెలిపారు. ఆర్థిక వృద్ది ఫలాలు కిందిస్థాయి ప్రజలకు చేరాలని ఆకాంక్షించారు. పరిపాలనలో కొత్త ఒరవడి వల్ల వేగవంతమైన అభివృద్ధి సాధ్యమని ప్రకటించారు. విద్యా వ్యవస్థలో నాణ్యత మరింత పెరగాలని మహిళలను గౌరవించేలా మన విద్యా విధానం ఉండాలని ప్రభుత్వానికి సూచించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి నాటికి పరిశుద్ధ భారత్‌ను సాధించాలని దేశప్రజలకు నిర్దేశించారు. పరిపాలనలో కొత్త ఒరవడి ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు.