తండ్రిపై పుస్తకం రాసిన మన్మోహన్ తనయ
న్యూఢిల్లీ, ఆగస్టు 17 (జనంసాక్షి) : మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ఆయన కూతురు పుస్తకం రాశారు. ఇందులో పలు విషయాలు వెల్లడయ్యాయి. మాజీ ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ తర్వాత అంతటి గొప్ప పేరున్న ఆర్థిక వేత్తగా మన్మోహన్‌కు పేరుప్రఖ్యాతులు ఉన్నాయి. సంస్కరణల యుగం ప్రారంభమైనప్పుడు ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తన పాలనాకాలంలో ఎవ్వరినీ నొప్పించకుండా బాధ్యతలను నిర్వర్తించినట్లు వీడ్కోలు సమావేశంలో పలువురు కొనియాడారు. ప్రపంచబ్యాంకులో ఉద్యోగిగా పనిచేసిన మన్మోహన్ ఆర్థిక రంగంలో ఎంతో అనుభవం ఉంది. ప్రధానిగా ఉన్నప్పటికీ ఏ ఒక్క సొంత నిర్ణయం తీసుకోకుండా మేడం సోనియా చెప్పినట్లుగా నడుచుకున్నార. ఒక్కమాటలో చెప్పాలంటే ఆమె కనుసన్నల్లో మెలిగారు. పదవిలో ఉన్నప్పుడు ఉన్న నిస్సయతే తన నిత్యజీవితంలో ఉన్నట్లు ఆమె రాసిన పుస్తకం ద్వారా తెలుస్తోంది. అలాంటి వ్యక్తిపై ఆయన కూతురు పుస్తకం రాయడంపై ఆసక్తి నెలకొంది. ఆ పుస్తకంలోని పలు అంశాలను పరిశీలిస్తే.. మన్మోహన్ వైద్యుడు కావాలని ఆయన తండ్రి కోరుకున్నారు. అందుకే మన్మోహన్‌సింగ్ తొలుత ప్రీమెడికల్ కోర్సులో చేరారు. కానీ రెండుమూడు నెలల్లోనే ఆయనకు సైన్స్ అంటే ఆసక్తి అనిపించక ఆ కోర్సు మానేశారు. ఈ విషయాన్ని మన్మోహన్ కుమార్తె దమన్‌సింగ్ తన తల్లిదండ్రుల ప్రస్థానంపై రాసిన ‘స్ట్రిక్ట్‌లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గురుశరన్’ అనే పుస్తకంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తన తండ్రి మంచి హాస్యచతురడని ఆమె పేర్కొన్నారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆయన చదువుకునేటప్పుడు ఇంటివద్ద నుంచి ఖర్చులకు వచ్చే డబ్బు సరిపోకపోతే ఒక్కోసారి భోజనం మానుకుని చాక్లెట్‌తో సరిపెట్టుకునేవారని దమన్‌సింగ్ చెప్పారు. ఇంటి విషయాల్లో ఆయన నిస్సహాయుడని, కోడిగుడ్డు కూడా ఉడకబెట్టుకోలేరని, టీవీ కూడా ఆన్ చేసుకోలేరని తెలిపారు.