పాక్‌ – భారత్‌ భేటీ రద్దు

2

కాశ్మీర్‌పై  జోక్యమే కారణం

న్యూఢిల్లీ, ఆగస్టు 18(జనంసాక్షి)  :

మరో వారం రోజుల్లో భారత్‌- పాకిస్తాన్‌  మధ్య జరుగ నున్న విదే శాంగ కార్యదర్శల సమావేశం రద్దయింది. ఈ సమావేశాలను రద్దు చేస్తున్నట్లు సోమవారం భారత్‌ స్పష్టంచేసింది. ఆగస్టు 25వ తేదీన పాకిస్తాన్‌లోని విదేశాంగ కార్య దర్శల సమావేశం పాల్గొనాల్సిన భారత్‌ తన పర్యట నను ఆకస్మి కంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటిం చింది. దీనికి కాశ్మీర్‌ సమస్యే ప్రధాన కారణం.జమ్మూ-కాశ్మీర్‌ అంశంపై పాక్‌ మరో వారం రోజుల్లో భారత్‌-పాకిస్తాన్‌  మధ్య జరుగనున్న విదేశాంగ కార్యదర్శల సమావేశం రద్దయింది. ఈ సమావేశాలను రద్దు చేస్తున్నట్లు సోమవారం భారత్‌ స్పష్టంచేసింది. ఆగస్టు 25వ తేదీన పాకిస్తాన్‌లోని విదేశాంగ కార్యదర్శల సమావేశం పాల్గొనాల్సిన భారత్‌ తన పర్యటనను ఆకస్మికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి కాశ్మీర్‌ సమస్యే ప్రధాన కారణం. జమ్మూ-కాశ్మీర్‌ అంశంపై పాక్‌ పదేపదే జోక్యం చేసుకోవడంపై భారత్‌ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌ అంతరంగీక వ్యవహారాల్లో పాకిస్తాన్‌ జోక్యాన్ని సహించబోమని దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా స్పష్టంచేసింది. పాకిస్తాన్‌ హై కవిూషన్‌ అబ్దుల్‌ బాసిత్‌ వేర్పాటువాద చర్చలకు తెరలేపిన అనంతరం భారత్‌ పర్యటనను రద్దు చేసుకుని గట్టి హెచ్చరికలు పంపింది. మళ్లీ పాకిస్తాన్‌ అందుకు అనుగుణగా మరోసారి చర్చలు జరపడానికి ప్రణాళిక సిద్ధంచేసిన సమయంలో భారత్‌ తన తిరుగుబాటు జెండా ఎగురవేసింది. ఇదిలా ఉండగా పాకిస్తాన్‌ తాజా వైఖరి అనేక రకాలైన ప్రశ్నలను ఎత్తిచూపేదిగా ఉందని భారత విదేశాంగ ప్రతినిధి అక్బరుద్దీన్‌ స్పష్టం చేశారు. కాగా, పాకిస్తాన్‌ తరుచూ భారత జవాన్లపై కాల్పుల జరిపి ఇరుదేశాల మధ్య ఉన్న విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించటాన్ని కూడా తీవ్రంగా పరిగణించింది.