సర్వే సబబే

5

హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

స్టేకు నిరాకరణ

హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) :

సర్వే నిర్వహించడం సబబేనని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సర్వేను ఆపేలా స్టే ఇవ్వాలని కొందరు హైకోర్టును ఆశ్రయించగా ఇప్పటికిప్పుడు ఆపలేమని, సర్వేను ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన హైకోర్టు దీనిపై ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇచ్చిందని పేర్కొంది. జీవో నంబరు 50లో ప్రభుత్వం అన్ని వివరాలు స్పష్టంగా చెప్పిందని హైకోర్టు పేర్కొంది. దీంతో తెలంగాణ ప్రభత్వం మంగళవారం జరప తలపెట్టిన సమగ్ర సర్వేకు ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోయాయి.  సర్వేను ఆపాలని ఇప్పటికిప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ఎలాంటి జీవో లేకుండానే సర్వే నిర్వహిస్తున్నారన్న పిటిషనర్‌ వాదనను తోసిపుచ్చింది. జీవో నెం 50లో ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇచ్చిందని కోర్టు అభిప్రాయపడింది. సర్వే కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లుచేశామని, బడ్జెట్‌ కేటాయింపులు కూడా జరిగాయని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సర్వేను ఆపడం వీలుకాదన్న ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. సర్వే చట్ట విరుద్ధమంటూ సుప్రీంకోర్టు న్యాయవాది పీవీ కృష్ణయ్య దాఖలు చేసిన హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే సర్వేకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. సమగ్ర సర్వే నిర్వహిస్తున్నది కేవలం లబ్దిదారులను గుర్తించేందుకే అని కోర్టుకు స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో న్యాయవాది పీవీ కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు తుది తీర్పును వెలువడించింది. ఈ సర్వేపై ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన స్పష్టమైన వివరణతో కోర్టు ఏకీభవించింది. ఇప్పటికిప్పుడే సర్వేను ఆపలేమని కోర్టు తేల్చిచెప్పింది.

సర్వేలో అన్ని వివరాలను ఇస్తే మంచిది

సర్వేలో అన్ని వివరాలను ఇస్తే మంచిదని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌ తెలిపారు. మధ్యాహ్నం ఆయన విూడియాతో మాట్లాడుతూ ఫిర్యాదులు ఉంటే ఈమెయిల్‌, కాల్‌సెంటర్‌ నంబర్‌ ద్వారా సంప్రదించవచ్చన్నారు. చెక్‌లిస్టులు హైదరాబాద్‌లో తప్ప ఎక్కడా ఇవ్వలేదని ఆయన తెలిపారు. మీడియా, అత్యవసర సేవల్లో ఉన్నవారు ఆఫీసు నుంచి లెటర్‌ తీసుకురావాలన్నారు. ఎక్కడ నివాసం ఉంటే అక్కడే నమోదు చేసుకోవాలన్న ఆయన భవిష్యత్తులో సర్వే వివరాలను మార్పు చేసుకోవచ్చన్నారు. ఇది బీపీఎల్‌, ఏపీఎల్‌ సర్వే కాదని, అందరూ పాల్గొనాలని కమిషనర్‌ చెప్పారు.సమగ్ర కుటుంబ సర్వే విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరంలేదని సోమేష్‌కుమార్‌ అన్నారు. ఇది ఆస్తుల సర్వేకాదని, కుటుంబాల సర్వే అనే విషయాన్ని ప్రజలు గుర్తు పెట్టుకోవాలని పేర్కొన్నారు. అవసరమైతే భవిష్యత్‌లో సర్వే వివరాలను మార్చుకోవచ్చని స్పష్టం చేశారు. అయితే సర్వే వివరాలు ఇవ్వడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరంలేదని, ఎక్కడివారక్కడే, ఏ ఊళ్లో ఉన్న వాళ్లు ఆ ఊళ్లో వివరాలు ఇస్తే సరిపోతుందని సూచించారు. సర్వేపై ఏవైనా ఫిర్యాదులుంటే ఈ-మెయిల్‌, కాల్‌ సెంటర్‌ నెంబర్‌ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. విూడియాతో సహా అన్ని అత్యవసర సేవల్లో ఉన్నవాళ్లు తమతమ కార్యాలయాల నుంచి లెటర్లు తీసుకోవాలని అన్నారు.     పోలీసులు పాల్గొంటున్నారు : ప్రభుత్వం నిర్వహించనున్న రేపటి కుటుంబ సమగ్ర సర్వేలో పోలీసులూ పాల్గొంటారని నగరపోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. రేపు సర్వేలో 4 వేల మంది పోలీసులు పాల్గొంటారని తెలిపారు. కానిస్టేబుల్‌ స్థాయి నుంచి ఎస్సై వరకు ఎన్యూమరేటర్లుగా పనిచేస్తారన్నారు. వారికి కేటాయించిన ప్రదేశాల్లో సర్వే నిర్వహిస్తారని పేర్కొన్నారు.