ఢిల్లీలో నర్సింహన్‌ బిజీబిజీ

1

‘వారిద్దరు’ కలిసిపోయారు

కేంద్రానికి నివేదిక

న్యూఢిల్లీ, ఆగస్టు 20 (జనంసాక్షి) : గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీలో తొలిరోజు బిజీబిజీగా గడిపారు. ఉభయ రాష్ట్రాల్లోని పరిస్థితులపై ఆయన కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. రెండు రాష్టాల్ర మధ్య వివాదాలు, ముఖ్యమంత్రులు సమావేశం, శాంతిభద్రతలు తదితర ముఖ్యమైన అంశాలన్నింటిపై ఆయన కేంద్రానికి వివరించినట్లు సమాచారం. ప్రధానంగా ఉద్యోగుల పంపిణీపై గవర్నర్‌ కేంద్రంతో సంప్రదించినట్లు సమాచారం. అలాగే, హైదరాబాద్‌లో శాంతిభద్రతలు, గవర్నర్‌కు విశేష అధికారాలపై స్పష్టత ఇవ్వాలని ¬ంశాఖను కోరినట్లు తెలిసింది.  బుధవారం ఉదయమే ఢిల్లీ చేరుకున్న గవర్నర్‌ తొలుత కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్టాల్ల్రోని పరిస్థితులపై గవర్నర్‌ నరసింహన్‌ ఆయనకు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఇటువల తన సమక్షంలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించిన వివరాలను కూడా ఆయనకు సమర్పించినట్లు తెలిసింది. విభజన అనంతరం రెండు రాష్టాల్ర మధ్య తలెత్తిన వివాదాలను గవర్నర్‌ ¬ం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్‌, ఎంసెట్‌ కౌన్సెలింగ్‌, బోధనా రుసుములు, ఉద్యోగుల విభజన, కృష్ణ జలాల వివాదం వంటి వాటిని రాజ్‌నాథ్‌కు వివరించినట్లు తెలిసింది. వివాదాల పరిష్కారానికి తీసుకున్న చర్యలను నరసింహన్‌ ¬ంమంత్రికి తెలిపారు. రెండు రాష్టాల్ర ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖరరావు, చంద్రబాబునాయుడుల ముఖాముఖి సమావేశం ఏర్పాటు, భేటీలో తీసుకున్న సానుకూల నిర్ణయాలను ఆయన వివరించారు. రెండు రాష్టాల్రు కలిసి పని చేయాలని ముఖ్యమంత్రులు నిర్ణయించారని, విద్యుత్‌, ఉద్యోగుల విభజన సహా అన్ని అంశాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారని తెలిపారు. అలాగే వీలైనంత త్వరగా ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని కోరినట్లు తెలిసింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్టాల్ర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కేంద్ర ప్రభుత్వం హావిూ ఇచ్చిందని గవర్నర్‌ నరసింహన్‌ తెలిపారు. ఒక్క రోజుతో సమస్యలన్నీ పూర్తికావని వ్యాఖ్యానించారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ఢిల్లీ వెళ్లిన గవర్నర్‌ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లను కలిశారు. ఉదయం రాజ్‌నాథ్‌తో సమావేశమైన అనంతరం గవర్నర్‌ విూడియాతో మాట్లాడారు. ఇటీవల రెండు రాష్టాల్ర ముఖ్యమంత్రులు చర్చించుకునున్న విషయం ¬ం మంత్రికి చెప్పానన్నారు. ఒక్క రోజులో సమస్యలన్నీ పరిష్కారం కావని తెలిపారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిశారని, ఇక అన్నీ సక్రమంగా జరుగతాయని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని ఆకాంక్షించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు సమస్యల పరిష్కారం దిశగా ఇప్పుడే ముందడుగు వేశారని చెప్పారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ప్రభుత్వం తరఫున ఏం చర్యలు తీసుకొనున్నారని విలేకరులు ప్రశ్నించగా.. ఇకపై వర్షాలు బాగా పడతాయని ఆశిస్తున్నానని అన్నారు. హైదరాబాద్‌లో గవర్నర్‌ అధికారాలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. రెండు రాష్ట్రాలకు చెందిన క్యాబినెట్‌ మంత్రులకు విందు ఏర్పాటు చేస్తే బాగుంటుందని రాజ్‌నాథ్‌ గవర్నర్‌కు సలహా ఇచ్చినట్లు తెలిసింది. త్వరలోనే రెండు రాష్టాల్ర ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు నరసింహన్‌ విందు ఇవ్వనున్నట్లు సమాచారం.