ఎమ్మెల్సీగా కర్నె ప్రభాకర్‌ ప్రమాణం

1

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 21 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా కర్నె ప్రభాకర్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు ఆయన గన్‌పార్కు వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. గురువారం ఉదయం కర్నె ప్రభాకర్‌ ఎల్బీనగర్‌ రింగ్రోడ్లోని తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులు అర్పించి, అక్కడ నుంచి ప్రమాణ స్వీకారానికి బయల్దేరారు. కాగా టీఆర్‌ఎస్‌ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ప్రభాకర్‌ పార్టీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున మునుగోడు నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2009లో పొత్తు కారణంగా పోటీ చేయలేకపోయారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ నామినేటెడ్‌ కోటాలో ఆయన ఎమ్మెల్సీగా నియమితులయ్యారు.