ఓటుకు ఆధార్‌తో అనుసంధానం
నవంబర్ 1 నుంచి ఓటర్ల జాబితా సవరణ
రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్
ఒంగోలు, ఆగస్టు 21 (జనంసాక్షి) : ఓటుకు ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. నవంబర్ 1 నుంచి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం చేపడతామన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో గురువారం ఆయన విూడియాతో మాట్లాడారు. నవంబరు 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. పోలింగ్‌లో అక్రమాల నివారణకు ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు. రెండుచోట్లా ఓటరు నమోదు ఉన్న సంఘటనలు దృష్టికి వచ్చాయన్నారు. దీనిని అరికట్టేందుకు ఆధార్ అనుసంధానం బెటరని భావిస్తున్నట్లు చెప్పారు. కొత్తకొత్త సంస్కరణలు ప్రవేశపెడుతున్న ఎన్నికల కమిషన్ మరిన్ని కార్యక్రమాలు చేపడుతోంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఉప ఎన్నికపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఉప ఎన్నికల్లో ఆళ్లగడ్డను చేర్చలేదు. ఎన్నికలకు ముందు ప్రమాదంలో శోభానాగిరెడ్డి మరణించడంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమయ్యింది.