ప్రఖ్యాత రచయిత అనంతమూర్తి ఇకలేరు

1
బెంగళూరు, ఆగస్టు 22 (జనంసాక్షి) : ప్రముఖ కన్నడ రచయిత అనంతమూర్తి శుక్రవారం బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను పది రోజల క్రితం ఆస్పత్రిలో చేర్పించారు. జ్వరం, ఇన్‌ఫెక్షన్‌ కారణంగా అనంతమూర్తి ఆరోగ్యపరిస్థితి క్షీణించిందని మణిపాల్‌ ఆస్పత్రికి చెందిన సీనియర్‌ వైద్యుడు విూడియాకు తెలిపారు. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. సాహిత్య రంగానికి చేసిన సేవలకు 1998లో పద్మవిభూషణ్‌ అవార్డు, 1994లోజ్ఞానపీఠ్‌ అవార్డును అనంతమూర్తి అందుకున్నారు. మోడీ ప్రధాని అయితే తాను దేశంలో ఉండనని గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.