అవసరమైతేనే పాలనలో గవర్నర్‌ జోక్యం

2
కేంద్ర ¬ంశాఖ స్పష్టీకరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 22 (జనంసాక్షి) : అవసరమైతేనే ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలు గవర్నర్‌ పరిధిలో ఉంటాయని కేంద్ర ¬ంశాఖ శుక్రవారం స్పష్టంచేసింది. విభజన చట్టం ప్రకారమే గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టినట్లు ప్రకటించింది. అయితే రోజువారి పాలనలో గవర్నర్‌ జోక్యం ఉండబోదని తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసింది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తిన పక్షంలో గవర్నర్‌ నేరుగా జోక్యం చేసుకుంటారని కేంద్ర¬ంశాఖ స్పష్టంచేసింది. మరోవైపు ఢిల్లీలో శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీని గవర్నర్‌ నరసింహన్‌ కలిసారు. రెండు రాష్టాల్ర పరిస్థితిని ప్రధానికి వివరించారు. తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేపై మోదీ ఆరా తీసినట్లు తెలిసింది.  అలాగే కేసీఆర్‌ పాలన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరు రాష్టాల్ర పనితీరుపై మోదీకి గవర్నర్‌ నివేదిక అందజేసినట్లు సమాచారం. సుమారు అరగంటపాటు ఈ భేటీ కొనసాగింది. ఇలా ఉండగా గవర్నర్‌ అధికారాల విషయమై ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో జరిపిన చర్చలు సఫలమైనట్లు టిఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌ తెలిపారు. గవర్నర్‌ అధికారాల విషయంలో మార్గదర్శకాలను వెనక్కి తీసుకునేందుకు కేంద్రం నిరాకరించినట్లు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లోగానీ, ముఖ్యమంత్రి అధికారాల్లోగానీ కేంద్రం జోక్యం చేసుకోబోదని హోంమంత్రి స్పష్టంచేసినట్లు ఆయన చెప్పారు. నిరాధారమైన వార్తలను ప్రచురించవద్దని మీడియానున ఆయన కోరారు.