విపక్ష నేత నియామకంపై కేంద్రం వైఖరేమిటి
సుప్రీంకోర్టు
రెండు వారాల్లో వివరణ ఇవ్వండి
న్యూఢిల్లీ, ఆగస్టు 22 (జనంసాక్షి) : లోక్‌సభలో విపక్ష నేత నియామకంపై కేంద్రం వైఖరేమిటో చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విషయంపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని కోరింది. లోక్‌పాల్ నియామకానికి సంబంధించిన సెలక్షన్ కమిటీలో ప్రతిపక్ష నాయకుడు కూడా సభ్యుడు కావడంతో లోక్‌సభలో ప్రతిపక్ష నేత నియామకంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలపాలని ఆదేశించింది. ఈ అంశాన్ని కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టొద్దని, రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రతిపక్షమనేది ప్రభుత్వానికి భిన్నమైన వాదన వినిపించడంలో కీలక పాత్ర పోషిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కొంతకాలంగా ప్రతిపక్ష ¬దాపై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. విపక్షాల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష పాత్ర ¬దా ఇవ్వాలని ఆ పార్టీ నేతలు కోరారు. అయితే, నిబంధనల ప్రకారం సభలో ప్రతిపక్షానికి ఉండవలసిన పది శాతం కనీస ప్రాతినిధ్యం (55 స్థానాలు) లేనందున కాంగ్రెస్ ప్రతిపక్ష ¬దా ఇచ్చేందుకు స్పీకర్ విూరాకుమార్ ఇటీవల నిరాకరించారు. గత నిబంధనలు, సంప్రదాయాలు అనుసరించిన ప్రతిపక్ష ¬దా ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. దీనిపై అధికార బీజేపీపై విరుచుకుపడిన కాంగ్రెస్.. న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ లోక్‌పాల్ ఏర్పాటుపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ నేపథ్యంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. చీఫ్ జస్టిస్ ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని ధర్మాసనం ప్రతిపక్ష నేత అంశంపై స్పందించింది. ఈ అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరిది. ప్రతిపక్ష నాయకుడి నియామకంలో ప్రభుత్వ దృక్పథం ఏమిటో తెలుసుకోవాలని చీఫ్ జస్టిస్ లోధా అటార్నీ జనరల్‌ను ఆదేశించారు. ఈ అంశాన్ని కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టొద్దని, రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను విస్మరించవద్దని లోధా సూచించారు. సభలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఉండబోదని ఎప్పుడూ ఊహించలేదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి భిన్నమైన వాదన వినిపించడంలో ప్రతిపక్ష నేత పాత్ర కీలకమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత కేవలం లోక్‌పాల్ చట్టానికే సంబంధించి కాకుండా ఇతర చట్టాల రూపకల్పనలోనూ కీలకమని తెలిపారు. ప్రతిపక్ష నేత నియామకంపై నాన్చకుండా సెప్టెంబర్ 9లోపు వివరణ ఇవ్వాలని స్పష్టంచేశారు.