మోడీతో నర్సింహన్‌ భేటీ

4

ఇరు రాష్ట్రాలపై రిపోర్టు

న్యూఢిల్లీ, ఆగస్టు 22 (జనంసాక్షి) : ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో గవర్నర్‌ నరసింహన్‌ శుక్రవారం సమావేశమయ్యారు. విభజన అనంతరం ఉభయ రాష్టాల్ల్రోని పరిస్థితులపై మోడీకి నివదిక ఇచ్చారు. ఉభయ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన, సమస్యలు, ఉద్యోగుల పంపిణీ, కృష్ణా జలాల వివాదం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, విద్యుత్‌ వంటి అంశాలను ప్రధానికి వివరించినట్లు తెలిసింది. రెండు రాష్టాల్ర ముఖ్యమంత్రుల సమావేశం గురించి గవర్నర్‌ ప్రధానికి వివరించారు. ఉభయులు సామరస్యక పూర్వక పరిష్కారాలు అంగీకరించారని తెలిపారు. ఉద్యోగుల విభజనపై త్వరగా తేల్చాలని కోరారు. ఇక, గవర్నర్‌కు హైదరాబాద్‌లో శాంతిభద్రతల అంశంపై స్పష్టత ఇవ్వాలని మోడీని నరసింహన్‌ కోరినట్లు తెలిసింది. హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు కేటాయిస్తూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలను తెలంగాన ప్రభుత్వం వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌పై అధికారాలు నిర్వహించడంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై ప్రధానిని అడిగినట్లు సమాచారం. న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్‌ శుక్రవారం మోడీని కలిశారు. వాస్తవానికి గురువారమే ఈ భేటీ జరగాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ప్రధాని అపాయింట్‌మెంట్‌ వాయిదా పడింది. రెండు రాష్టాల్ల్రో పరిస్థితిపై నరసింహన్‌ మోడీకి ఓ నివేదిక సమర్పించినట్లు తెలిసింది. తన సమక్షంలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశ అంశాలను కూడా వివరించినట్లు సమాచారం. ప్రధానితో భేటీ ముగిసిన అనంతరం గవర్నర్‌ విూడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.