సివిల్స్‌ ప్రిలిమినరీలో మార్పులేదు

2

వాయిదా పిటిషన్‌ కొట్టేసిన ‘సుప్రీం’

న్యూఢిల్లీ, ఆగస్టు 23 (జనంసాక్షి) : సివిల్‌ సర్వీస్‌ ప్రిలిమినరీ పరీక్షలో ఎలాంటి మార్పు ఉండబోదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈమేరకు ప్రీలిమినరి పరీక్షలు వాయిదాపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శనివారం కొట్టేసింది. ఈ నెల 24న జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయాలని పిటిషనర్‌ కోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. తొమ్మిది లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్నందున పరీక్షలను వాయిదావేయలేమని, షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని న్యాయస్థానం స్పష్టంచేసింది. మే 1 నుండి పరీక్షా సమయం సరిపోయిందని, 9 లక్షల మంది అభ్యర్థులకు అన్యాయం చేయలేమని కోర్టు తెలిపింది. సివిల్‌ సర్వీసెస్‌ ప్రీలిమినరి పరీక్ష రెండవ పేపర్‌లో ఇంగ్లీష్‌ కాంప్రమెన్స్‌ విభాగం ప్రశ్నలను అభ్యర్థులు వదిలిపెట్టవచ్చని, యుపిపిఎస్‌ఇ నిర్ణయంపై దాఖలైన పిటిషన్‌ను కింది కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో అభ్యర్థుల తరఫున న్యాయవాది నగ్యాన్‌ ప్రజాప్రయోజనాల వ్యాజ్యం కింద సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిని పరిశీలించిన కోర్టు ఇది వ్యక్తిగత కారణంపై వేసినదిగా ఉందని, ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందని ప్రశ్నించింది. న్యూఢిల్లీ, ఆగస్టు 23 (ఎపిఇఎంఎస్‌): సివిల్‌ సర్వీసెస్‌ ప్రీలిమినరి పరీక్షలు వాయిదాపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శనివారం కొట్టేసింది. ఈ నెల 24న జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయాలని పిటిషనర్‌ కోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. 9లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్నందున పరీక్షలను వాయిదావేయలేమని, షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. మే 1 నుండి పరీక్షా సమయం సరిపోయిందని, తొమ్మిది లక్షల మంది అభ్యర్థులకు అన్యాయం చేయలేమని కోర్టు తెలిపింది. సివిల్‌ సర్వీసెస్‌ ప్రీలిమినరి పరీక్ష రెండవ పేపర్‌లో ఇంగ్లీష్‌ కాంప్రమెన్స్‌ విభాగం ప్రశ్నలను అభ్యర్థులు వదిలిపెట్టవచ్చని, యుపిపిఎస్‌ఇ నిర్ణయంపై దాఖలైన పిటిషన్‌ను కింది కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో అభ్యర్థుల తరఫున న్యాయవాది నగ్యాన్‌ ప్రజాప్రయోజనాల వ్యాజ్యం కింద సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిని పరిశీలించిన కోర్టు ఇది వ్యక్తిగత కారణంపై వేసినదిగా ఉందని, ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందని ప్రశ్నించింది. షెడ్యూల్‌ ప్రకారమే ఈ నెల 24న పరీక్షలు జరుగుతాయని సుప్రీంకోర్టు తెలిపింది.

తాజావార్తలు