మహరాష్ట్ర గవర్నర్‌ శంకర్‌నారాయణన్‌ రాజీనామా

1

ముంబయి, ఆగస్టు 24(జనంసాక్షి) : మహారాష్ట్ర గవర్నర్‌ కె.శంకరనారాయణన్‌ (82) ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పంపించారు. కేంద్ర ప్రభుత్వం తనను మిజోరం గవర్నర్‌గా బదిలీ చేయడంతో ఆయన ఈ చర్య తీసుకున్నారు. అవమానకర రీతిలో వేరే రాష్ట్రానికి గవర్నర్‌గా వెళ్లడం కంటే రాజీనామా చేయడానికే ఇష్టపడతానని శంకరనారాయణన్‌ ఇంతకు ముందే ప్రకటించారు. కేరళలో కాంగ్రెస్‌ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన శంకరనారాయణన్‌ను యూపీఏ సర్కార్‌ జనవరి, 2010లో మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లు అందరూ తప్పుకోవాలని కేంద్ర ¬ం శాఖ కార్యదర్శి నేరుగా ఫోన్‌చేసి చెప్పినా శంకరనారాయణన్‌ నిరాకరించారు. సరైన వ్యక్తులు అడిగితే పరిశీలిస్తానన్నారు. దీంతో చివరికి ఆయన్ని ఇటీవల డిస్‌మిస్‌ చేసిన కమలా బేనివాల్‌ స్థానంలో మిజోరం గవర్నర్‌గా బదిలీచేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రపతి భవన్‌ శనివారం రాత్రి ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీచేసింది. ఆదివారం రాష్ట్రపతి నుంచి బదిలీ ఉత్తర్వులు అందిన వెంటనే శంకరనారాయణన్‌ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

తాజావార్తలు