సెకండరీ విద్యలో సంస్కరణలు
తెలంగాణ సర్కారు పచ్చజెండా
హైదరాబాద్, ఆగస్టు 26 (జనంసాక్షి) : సెకండరీ విద్యలో సంస్కరణలకు తెలంగాణ సర్కారు పచ్చజెండా ఊపింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్కరణలు చేపట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదవతరగతిలో సంస్కరణలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇకడ నుంచి 9, 10వ తరగతుల్లో ఇంటర్నల్స్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ప్రతి సబ్జెక్ట్‌కు 80 మార్కులు, 20 మార్కులు ఇంటర్నల్స్ ఉంటాయని విద్యాశాఖ వెల్లడించింది. ఇంటర్నల్స్ పాస్ తప్పనిసరికాదని, గతంలో మాదిరిగానే పదవ తరగతిలో 11 పేపర్ల విధానం ఉంటుందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ద్వితీయ భాష మినహా ప్రతి పేపర్‌కు 40మార్కులు ఉంటాయని, ప్రతి సబ్జెక్ట్‌లో 28 మార్కులు వస్తే పాస్ అయ్యే విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. గతంలో సెకండ్ లాంగ్వేజ్‌లో 20 మార్కులకు పాస్‌కాగా, ఇప్పుడు 35మార్కులను పాస్‌గా నిర్ణయించారు. తొమ్మిది, పదోతరగతిలోనూ నిరంతర సమగ్ర మూల్యాంకనం విధానం ఉంటుందని విద్యాశాఖ తెలిపింది.