ఆధారాలు చూపండి.. తప్పుకుంటా

4
నా కుటుంబంపై దుష్ప్రచారం : కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌

బాసటగా నిలిచిన పిఎంఓ

న్యూఢిల్లీ, ఆగస్టు 27 (జనంసాక్షి) : తప్పుచేసినట్లు ఎలాంటి ఆధారాలు చూసినా  తక్షణమే పదవి నుంచి తప్పుకొంటానని కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. కొద్దిరోజులుగా తనపై, తన కుటుంబంపై దుష్ప్రచారం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం ఢిల్లీలో రాజ్‌నాథ్‌ విూడియాతో మాట్లాడారు. వస్తున్న పుకార్ల గురించి తానే స్వయంగా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలకు వివరించానన్నారు. విన్న వెంటనే వారు ఎంతో ఆశ్చర్యం వ్యక్తంచేశారని ¬ంమంత్రి తెలిపారు. ఆ కథనాలను వారు ఖండించారని చెప్పారు. తమ కుటుంబ సభ్యులు తప్పు చేసినట్లు ప్రాథమిక ఆధారాలు చూపిస్తే, తన కుమారుడికి వ్యతిరేకంగా ఏ చిన్న ఆధారం చూపినా తాను ప్రజా జీవితం నుంచి వైదొలుగుతానని ఆయన ప్రకటించారు. ‘గత 15-20 రోజులుగా నా కుమారుడికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది. ఆరోపణలన్నీ అవాస్తవాలు, నిరాధారాలు. ఆరోపణలతో బలపడాలని కొందరు యత్నిస్తున్నారని’ వ్యాఖ్యానించారు. దుష్పచ్రారం చేసేందుకే అవాస్తవాలు వ్యాపింపజేస్తున్నారని మండిపడ్డారు. ‘ఏ ఆరోపణలోనైనా తనకు కానీ, తన కుటుంబ సభ్యులకు కానీ వ్యతిరేకంగా ఒక్క చిన్న ఆధారం చూపినా తాను రాజకీయాల నుంచి, ప్రజా జీవితం నుంచి తప్పుకొని ఇంట్లో కూర్చుంటానని’ సవాల్‌ విసిరారు. పుకార్ల వెనుక ఎవరైనా ఉన్నారని అనుమానిస్తున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా.. స్పందించేందుకు రాజ్‌నాథ్‌ నిరాకరించారు. మరోవైపు, కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ కుటుంబంపై వస్తున్న ఆరోపణలను ప్రధాని కార్యాలయం కొట్టిపడేసింది. రాజ్‌నాథ్‌ తనయుడిపై ఆరోపణలు అర్థరహితమని, పచ్చి అబద్దాలని పేర్కొంది. ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చేందుకే ఇలాంటి అపోహలు సృష్టిస్తున్నారని ప్రధాని కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ‘వార్తలన్నీ పూర్తిగా నిరాధారం. ప్రభావపూరితం. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కావాలనే కొందరు ఇలాంటి దుష్పచ్రారాలు చేస్తున్నారని’ తెలిపింది. ఇలాంటి దుష్పచ్రారాలు జాతి ప్రయోజనాలను దెబ్బతీస్తాయని పేర్కొంది. రాజ్‌నాథ్‌ తనయుడు పంకజ్‌సింగ్‌ వ్యవహారంపై కొంతకాలంగా ఢిల్లీలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అవినీతి, చెడు ప్రవర్తన కారణంగానే నరేంద్ర మోడీ పంకజ్‌సింగ్‌కు టికెట్‌ను నిరాకరించారనే వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. దీని వెనుక సహచర మంత్రి ఒకరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీనిపై రాజ్‌నాథ్‌ ఇప్పటికే అటు బీజేపీ అధిష్టానానికి, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తమ కుటుంబంపై కావాలనే తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, మోడీ ప్రభుత్వంలో ఆధిపత్య పోరుకు ఇది నిదర్శనమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.