తెరాసలోకి భారీ వలసలు

22A2B

ఫరీదుద్దీన్‌, నరేంద్రనాథ్‌, స్వామిచరణ్‌ గులాబీ తీర్థం

తెరాసా వైపు వైకాపా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల చూపు

హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సమితిలోకి భారీగా వలసలు మొదలయ్యాయి. గురువారం మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌, బీజేపీ నేత నరేంద్రనాథ్‌, మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత స్వామిచరణ్‌ ఇతర నేతలు సీఎం కేసీఆర్‌ సమక్షంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.  వీరితోపాటు జిల్లానుంచి వచ్చిన వందలాది మంది కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరి చేరికతో మెదక్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ తిరుగులేని శక్తిగా బలం పుంజుకుంది. తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మరొకరు టిఆర్‌ఎస్‌ బాటపట్టారు. ఖమ్మం జిల్లా ఇల్లెందు శాసనసభ్యుడు కోరం కనకయ్య ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిశారు. ఆయన కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పి టిఆర్‌ఎస్‌లో చేరవచ్చని భావస్తున్నారు. ఇల్లెందులో చాలా కాలం తర్వాత కాంగ్రస్‌ ఎమ్మెల్యే గెలిచారనుకుంటే, ఆయన కూడా టిఆర్‌ఎస్‌లో చేరబోతుండడం విశేషం. ఇప్పటికే ఆదిలాబాద్‌ జిల్లా ముధోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కాంగ్రెస్‌ కు గుడ్‌ బై చెప్పి టిఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు కనకయ్య కూడా టిఆర్‌ఎస్‌లో చేరితో కాంగ్రెస్‌ బలం పందొమ్మిదికి తగ్గుతుంది. అలాగే వైరా వైకాపా ఎమ్మెల్యే కూడా టిఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్దం అయ్యింది. ఇదిలావుంటే  మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌, బీజేపీ నేత నరేంద్రనాథ్‌, కాంగ్రెస్‌ నేత స్వామిచరణ్‌ ఇతర నేతలు సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వీరు పార్టీలో చేరారు. వీరి చేరికతో మెదక్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ తిరుగులేని శక్తిగా బలం పుంజుకుంది. మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీతో ఉన్న తన అనుబంధాన్ని వదలుకుంటున్నట్లే అని తెలుస్తోంది. ఆయన టిఆర్‌ఎస్‌లో చేరడం దాదాపు ఖయామని అందరూ అనుకుంటున్నారు. తన సహచరులతో సహా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడానికి రంగం సిద్దం చేసుకుంటున్నట్లు కధనాలు సూచిస్తున్నాయి. గత కొంతకాలంగా ఈ ప్రచారం జరుగుతోంది.దానిని నిర్ధారించే విధంగా జిల్లాలో ఆయన అనుచరులు దీనికి అనుగుణంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తో సహా జడ్పిటిసీలు, ఇతర టిడిపి నేతలు అంతా కలిసి టిఆర్‌ఎస్‌ లో చేరవచ్చని అంటున్నారు. కాగా తుమ్మల చేరికపై టిఆర్‌ఎస్‌ కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. తుమ్మలకు మంత్రి పదవి ఇస్తే ఆయనలో అసంతృప్తి ఇంకా పెరగవచ్చని చెబుతున్నారు.