ఆధునిక చిత్రకారుడు బిపిన్‌చంద్ర ఇకలేరు

1

న్యూఢిల్లీ, ఆగస్టు 30 (జనంసాక్షి) : ప్రముఖ ఆధునిక చిత్రకారుడు బిపిన్‌ చంద్ర శనివారం ఉదయం కన్నుమూశారు. నిద్రలోనే అతను తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. 1928లో హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రావ్యాలీలో జన్మించారు. 1983లో యుజిసి సభ్యుడిగా పనిచేశారు. 2002-2014 మధ్యకాలంలో నేషనల్‌ బుక్‌ ట్రస్టు చైర్మన్‌గా వ్యవహరించారు. స్వాతంత్య్రోద్యమంపై ఆయన ఎనలేని పాండిత్యం ఉంది. మహాత్మాగాంధీపై ఆయన సాధికారత సాధించారు. కమ్యూనిస్టు భావాలుగల బిపిన్‌చంద్ర రాసిన పుస్తకాలు విద్యాసంస్థల్లో ప్రామాణికంగా పాఠ్యగ్రంథాలుగా ఉన్నాయి. ఆయన తీసిన చిత్రాలు, చేసిన రచనలు భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకాలుగా నిలిచాయి.