గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సాగర్‌జీ
ముంబయి, ఆగస్టు 30 (జనంసాక్షి) : మహారాష్ట్ర గవర్నర్‌గా సీహెచ్. విద్యాసాగర్‌రావు బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో విద్యాసాగర్‌రావుతో ఆ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ మోహిత్‌షా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ, మహారాష్ట్ర సీఎం పృథ్విరాజ్‌చవాన్, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. మహారాష్ట్రలో ఈ పదవి చేపట్టడం పట్ల తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. తెలుగు వ్యక్తికి అరుదైన హోదా లభించడం గర్వకారణమని పలువురు కొనియాడారు.