నేడు బాపు అంత్యక్రియలు

1

పలువురు సినీ ప్రముఖుల నివాళి

చెన్నై, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : ప్రముఖ దర్శకుడు బాపు అంత్యక్రియలు నేడు నిర్వహించనున్నారు. అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ చిత్ర దర్శకుడు బాపు భౌతికకాయానికి చెన్నైలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించారు. ఆయన మృతితో కడసారి చూపు కోసం సినీ దిగ్గజాలు చెన్నైకి తరలివచ్చారు. పలువురు ప్రముకులు తరలివచ్చి బాపుతో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. అలాగే ఆయన లేనిలోటును పూడ్చలేమన్నారు. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, గాయకుఏడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, దర్శకుడు శేఖర్‌ కమ్ముల, భానుచందర్‌, దివ్యవాణి, శరత్‌బాబు, భాజపా నేత రఘురామకృష్ణంరాజు తదితరులు నివాళులు అర్పించి శ్రద్దాంజలి ఘటించారు. బాపుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అభిమానుల సందర్శనార్థం బాపు భౌతికకాయాన్ని చెన్నైలోని ఆయన స్వగృహంలో ఉంచారు. మంగళవారం చెన్నైలో బాపు అంత్యక్రియలు జరగనున్నాయి. అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ దర్శకుడు బాపు భౌతికకాయానికి చెన్నైలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు. బాపు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ బాపు లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. ఆయనతో సినిమా చేయడం తన పూర్వ జన్మ సుకృతమని అన్నారు. ఆయనలాంటి దర్శకుడు లేరని అన్నారు. బాపు భౌతికకాయానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నివాళులు అర్పించారు. బాపు ఎంతో గొప్ప మానవతావాది అన్నారు. ఆయన మృతి తెలుగువారికి ప్రత్యేకించి తీరనిలోటని అన్నారు. రమణ మృతితోనే బాపు సగం చనిపోయారని అన్నారు. రమణలేని లోటును జీర్ణించుకోలేకపోయారని అన్నారు. ఇక తన భార్య మరణంతో మరింతగా కుంగిపోయారన్నారు. అలాంటి మహానుభావుడయిన బాపు మనవాడు కావడం గర్వించాలన్నారు. బాపుతో తనకున్న అనుబంధాన్ని బాలు నెమరువేసుకున్నారు. అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ దర్శకుడు బాపు భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, సీనీ నటుడు శరత్‌బాబు తదితరులు బాపు భౌతికకాయం వద్ద శ్రద్దాంజలి ఘటించారు. బాపు మృతి తీరనిలోటన్నారు. కోట శ్రీనివాసరావు, నటుడు నరేశ్‌ తదితరులు బాపు గొప్పతనాన్ని కీర్తించారు. బాపు అంత్యక్రియలు మంగళవారం చెన్నైలో నిర్వహించనున్నారు. అంత్యక్రియలు రేపు జరుగుతాయని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. చెన్నై బీసెంట్‌నగర్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చెప్పారు.