నా రక్తంలో వాణిజ్య ఉంది
భారత్-జపాన్‌ల బంధం బలమైంది
ప్రధాని నరేంద్రమోడీ
టోక్యో, సెప్టెంబర్ 1 (జనంసాక్షి) : ‘నేను గుజరాతీని, నా రక్తంలోనే వాణిజ్యం ఉంది’ అని ప్రధాని నరేంద్రమోడీ సోమవారం అన్నారు. భారత్-జపాన్‌ల మధ్య వాణిజ్య బంధం బలమైందన్నారు. జపాన్ వచ్చే ఐదేళ్లలో భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. 35 బిలియన్ డాలర్ల ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు పెట్టనుంది. భారత్‌కు ఆర్థిక, సాంకేతిక సాయం చేసేందుకు కూడా జపాన్ అంగీకరించింది. మోడీ పర్యటనతో ఇవన్నీ సాకారం కాబోతున్నాయి. ఇరు దేశాలు పలు ద్వైపాక్షిక అంశాలపై అంగీకారానికి వచ్చాయి. భారత్, జపాన్ దేశాల మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకుగాను భారత ప్రధాని నరేంద్రమోడీ ఆ దేశంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పర్యటనలో మూడోరోజైన సోమవారం ప్రధాని చాలా బిజీగా గడిపారు. ఉదయమే ఆయన జపాన్‌లోని ప్రధాన పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. తన కార్యాలయంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేస్తామని, జపాన్ నుంచి వచ్చిన ప్రతిపాదనలను సత్వరం పరిష్కరిస్తామని ఆయన వారికి తెలిపారు. ఈ బృందంలో ఇద్దరు జపానువారికీ అవకాశం ఇవ్వనున్నట్లు మోడీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గుజరాతీనని, వాణిజ్యం అనేది తన రక్తంలోనే ఉందన్నారు. వ్యాపారాలకు కావలసింది రాయితీలు కాదని, ప్రోత్సాహకరమైన వాతావరణమని మోడీ తెలిపారు. అందుకు భారతదేశం అనుకూలంగా ఉందన్నారు.
తన ప్రభుత్వంలోను, తన కార్యాలయంలోను కూడా జపాన్ తరహా సమర్ధతను తీసుకురావడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి వ్యాపారవేత్తలను, ప్రభుత్వాధికారులను, నాయకులను అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడారు. వ్యాపారాలకు, పెట్టుబడులకు తమ దేశం రావాల్సిందిగా వారికి పిలుపునిచ్చారు. నేను గుజరాతీని.. వాణిజ్యం నా రక్తంలోనే ఉంది. వాణిజ్యవేత్తలకు రాయితీలు అవసరం లేదు. వాళ్లకు ఎదగడానికి మంచి వాతావరణం మాత్రమే అవసరం అది తాను కల్పిస్తానని ప్రధాని మోడీ అన్నారు. జపాన్ నుంచి వచ్చే ప్రతిపాదనలను పరిశీలించడానికి తన కార్యాలయంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేస్తానని మోడీ చెప్పారు. అలాగే, ఈ బృందంలో జపాన్ ఎంపిక చేసే ఇద్దరు వ్యక్తుల కోసం కార్యాలయం కూడా ఇస్తామన్నారు. ఇంతకాలం ఉన్న నిరుత్సాహకరమైన వాతావరణం ఇక ముగిసిపోయిందని, జపాన్ పెట్టుబడిదారులు భారత్‌కు వస్తే, వాళ్లకు చకచకా అనుమతులు లభిస్తాయని పారిశ్రామికవేత్తలకు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తైమ్రాసికంలోనే 5.7 వృద్ధిరేటు నమోదైంది. ఇది చాలాపెద్ద ముందడుగు. ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి అంటూ తన విజయాన్ని చెప్పకనే చెప్పారు. చైనా పేరు ఎత్తకుండానే ఆ దేశం విూద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విదేశీ విధానంలో అభివృద్ధి వాదమే కావాలి తప్ప విస్తరణ వాదం కాదన్నారు. 18వ శతాబ్దం నాటి ఆలోచనల్లో మగ్గిపోయేవాళ్లు ఇతరుల జలాల్లోకి ప్రవేశించి, ఆక్రమణలకు పాల్పడతారని చెప్పారు. జపాన్‌కు కూడా చైనాతో విరోధం ఉన్న దృష్ట్యా ప్రధాని వ్యాఖ్యలు ప్రాధానం సంతరించుకున్నాయి. నా విస్తరణ వాదంపై పరోక్ష విమర్శలు చేయడం ద్వారా భారత దేశానికి జపాన్‌తో సన్నిహిత సంబంధాలపైనే ఆసక్తి ఉందని భారత ప్రధాని నరేంద్రమోదీ సంకేతాలు ఇచ్చారు. ఇందులో భాగంగా జపాన్-భారత దేశాల మధ్య ప్రధానమైన ఒప్పందాలపై కీలక చర్చలు జరుగుతున్నట్లు తెలియవచ్చింది. అదే సమయంలో నరేంద్రమోదీ జపనీస్ మంత్రులు, వాణిజ్యవేత్తలతో భేటీ అయ్యారు. ర్వాత మోదీ జపాన్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగమంత్రి అయిన తొమియో కిషిడాతో సమావేశమయ్యారు. ఇండో-జపాన్ అణు ఒప్పందం సంబంధించి ఆయనతో చర్చించినట్లు సమాచారం. అమెరికాతో భారత్ అణు ఒప్పందం కుదుర్చుకోవడాన్ని జపాన్ వ్యతిరేకించింది. ఆ నేపథ్యంలో మోదీ నేరుగా తుమియోతో చర్చలు జరిపారు. అలాగే చైనా ఆధిపత్య ధోరణిని తట్టుకోడానికి భారత్-జపాన్ కలిసి రక్షణ రంగంలో పనిచేయాల్సిన ఆవశ్యకత కూడా చర్చించినట్లు తెలియవచ్చింది. తర్వాత నరేంద్రమోదీ జపాన్ ఆర్థిక, వాణిజ్య పరిశ్రమలశాఖ మంత్రి తోషిమిస్సు మోతెగితో భేటీ అయ్యారు. వాణిజ్య సంబంధాలను మరింత మెరుగు పరిచేందుకు గల అవకాశాలను చర్చించారు. విద్యుత్, మౌలిక సదుపాయాలు, రక్షణ రంగాల్లో పెట్టుబడులకు పుష్కలమైన అవకాశాలు ఉన్న సంగతిని మోదీ వివరించారు. అనంతరం జపాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసిన బిజినెస్ లంచ్ కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. జపనీస్ వాణ్యివేత్తలను భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆయన ఆహ్వానించారు. భారత దేశానికి జపాన్ సహకరించాలని కోరారు.
పాఠశాలలో మోడీ
మోదీ మూడో రోజు పర్యటన ఒక పాఠశాలతో ప్రారంభమైంది. సోమవారం టోక్యోలోని ఓ పాఠశాల సందర్శనంతో ప్రారంభమైంది. 136 ఏళ్లనాటి పాఠశాలను మోదీ సందర్శించారు. అక్కడ విద్యార్థులతో కొద్దిసేపు కాలక్షేపం చేశారు. అనంతరం జపాన్‌లో ప్రాథమిక విద్యాబోధన ఎలా జరుగుతుందో ఆయన తెలుసుకున్నారు. జపనీస్ విద్యాశాఖ అధికారులు మోదీ బృందానికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా దేశంలో విద్యా వ్యవస్థ గురించి వివరించారు. 1923లో సరిగ్గా ఇదే రోజు టోక్యోలో వచ్చిన భూకంపంలో పాఠశాల ధ్వంసమైంది. ఆ బడిని జపాన్ ప్రభుత్వం పునరుద్ధరించింది. పునర్‌నిర్మాణం తర్వాత ఆ పాఠశాల నేటికీ పనిచేస్తోంది. ఆ వివరాలను పాఠశాల నిర్వాహకులు భారత బృందానికి వివరించారు. పాఠశాలలో తానే పెద్ద విద్యార్థినని మోడీ నవ్వుతూ వ్యాఖ్యానించారు. బడిపిల్లలతో కాసేపు మాట్లాడిన ఆయన తనకు చాలా విషయాలు తెలిశాయన్నారు. ఆధునికత, క్రమశిక్షణ, నైతిక విలువలను జపాను తమ విద్యావిధానంలోకి ఎలా మేళవించిందో అర్థం చేసుకోడానికే తానీ పాఠశాలను సందర్శించినట్లు మోడీ తెలిపారు. విద్యార్థులు భారత ప్రధాని కోసం ప్రత్యేకంగా ఒక పాట పాడారు. మోడీ వారితో మమేకమై కాసేపు నవ్వుతూ సరదాగా గడిపారు. జపాన్ టీచర్లను ఆయన భారత్ రమ్మని ఆహ్వానించారు. అక్కడి విద్యాశాఖ ఉప మంత్రి జపాను విద్యావిధానం గురించి మోడీకి వివరిస్తూ చక్కటి ప్రెజెంటేషన్ ఇచ్చారు.
ఆకట్టుకున్న మోడీ
రెండో రోజు ఆయన పర్యటన పలకరింపులతో సాగింది. క్యోటో ¬టల్ నుంచి ఎయిర్‌పోర్టుకు బయలుదేరి కారెక్కుతున్న ప్రధాని మోదీ ఒక్కసారిగా ఆగిపోయారు. ¬టల్ లాంజ్‌లో దూరం నుంచి గుజరాతీలో తనను పలకరిస్తున్న మహిళను చూసి, వెంటనే గుర్తుపట్టారు. నేరుగా ఆమె దగ్గరికి వెళ్లి బాగున్నారా మినాజీ! అని అప్యాయంగా పలకరించారు. కుశల ప్రశ్నల తర్వాత ఆమెతో ఫొటో దిగారు. ప్రధాని చూపిన ఆప్యాయతతో ఉబ్బితబ్బిబ్బయిన ఆమె ఆనందబాష్పాలు రాల్చారు. ఎపుడో ఏడేళ్ల క్రితం గుజరాత్ సీఎంగా వచ్చిన మోదీకి గుజరాతీ వంటకాలు చేసిపెట్టిన మినాజీ చుడ్గార్ అనే జపాన్ మహిళపై ఆయన చూపిన ఆప్యాయత ఇది. ఆదివారం మోదీ క్యోటోలోని రెండు బౌద్ధాలయాలను సందర్శించినపుడు కూడా ప్రధాని ఇలానే అందర్నీ ఆకట్టుకున్నారు. క్యోటోలోని మరో ప్రధాన బౌద్ధాలయం కింకాకుజికి వెళ్లి ప్రార్థనలు చేశారు. ఆలయ పరిసరాల్లోని సరస్సు, తోటల్లో కలియదిరుగుతూ అందర్నీ పలకరిస్తూ ఉత్సాహంగా గడిపారు. కొందరు టూరిస్టులు ప్రధానితో ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు. క్యోటో బౌద్ధ వారసత్వ కట్టడాలకు భారతదేశమే ప్రేరణ అని వివరించారు. సాంస్కృతిక వైభవం దెబ్బతినకుండా వారణాసిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు క్యోటో మేయర్-భారత రాయబారి మధ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.
భారత్,జపాన్ బంధం ఎంతో పురాతనమైనది: మోడీ
భారత్-జపాన్‌ల మధ్య బంధం ఎంతో పురాతనమైనదని, ఎప్పటినుంచో ఉన్న బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మనది పురాతన బంధమని అన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న మోడీ సోమవారం సాయంత్రం జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ 21వ శతాబ్దం ఆసియా దేశాలదని, దీన్ని సద్వినియోగం చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. భారత్, జపాన్‌లు విశ్వవేదికపై శక్తిమంతమైన పాత్ర పోషించే అవకాశం ఉందన్నారు. ఇరుదేశాల మధ్య ఉన్న బంధానికి ఎంతో ప్రాముఖ్యం ఉందన్నారు. జపాన్‌లో భారతదేశం, భారతీయుల పట్ల ఉన్న అభిమానానికి ఎంతో ఆనందం కలిగిందని ఆయన చెప్పారు. కాలపరీక్షను తట్టుకుని నిలబడిన స్నేహమిదన్న మోడీ, శిఖరాగ్ర సమావేశాల్లో చర్చలతో భవిష్యత్ భాగస్వామ్యంపై విశ్వాసం కలిగిందన్నారు. కాలపరీక్షను తట్టుకొని నిలబడిన స్నేహం భారత్, జపాన్‌లదని ప్రధాని నరేంద్రమోడి అన్నారు. ఐదు ఒప్పందాలపై తాము సంతకాలు చేశామని మోడీ తెలిపారు. జపాన్, భారత్‌ల మధ్య కేవలం ఆర్థిక సంబంధాలే కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఇరుదేశాల బంధం మరో ముందడుగని ఆయన పేర్కొన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న మోడీ ఆ దేశ ప్రధాని షింజోఅబేతో పలుకీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మోడీ ప్రసంగిస్తూ భారత్, జపాన్ రెండూ శాంతి కాముక దేశాలని అన్నారు. ఐదు కీలక అంశాలవిూద ఇరుదేశాలు సంతకాలు చేశాయని తెలిపారు. ఆరోగ్యం, వారణాసి, క్యోటో, విధ్య అంశాలపై సంతకాలు చేసినట్టు పేర్కొన్నారు. భారత్, జపాన్ మధ్య ఉన్న బంధం పురాతనమైందని.. ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు. రెండు దేశాలకు విశ్వ వేదికపై శక్తివంతమైన పాత్ర వహించే అవకాశముందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో ఆ దేశం ప్రధాని, ప్రైవేటు పెట్టుబడి దారులు పలు ఒప్పందాలు చేసుకున్నారు. భారత్‌లో వచ్చే ఐదేళ్లలో భారీగా పెట్టుబడులు జపాన్ పెట్టనుంది. 35 బిలియన్ డాలర్ల ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు జపాన్ పెట్టనుంది. భారత్‌కు ఆర్థిక, సాంకేతిక సహాయం అందించేందుకు జపాన్ అంగీకరించింది. భారత్‌లో బుల్లెట్ రైళ్లకు జపాన్ ఆర్థిక, సాంకేతిక సహాయం చేయనుంది. గంగానది ప్రక్షాళనకు జపాన్ ఆర్థిక సహాయం చేయనుంది.