టీఆర్‌ఎస్‌లోకి కొనసాగుతున్న వలసలు

5

కేసీఆర్‌ సమక్షంలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలు

తెలంగాణలో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌

కేసీఆర్‌ను కలిసిన తలసాని

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : తెరాసలోకి వలసలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు సోమవారం తెరాసలో చేరారు. తెరాస నేత కేకే వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ తిరుగులేని శక్తి అవతరిస్తోంది. వైకాపాకు చెందిన వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్‌, కాంగ్రెస్‌కు చెందిన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు ముగ్గురు వెంకట్రావు, రాజేశ్వరరావు, యాదవరెడ్డి తెరాసలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ ¬ంమంత్రి నాయిని మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో టిడిపి  ఖాళీ అవుతోందన్నారు. హైదరాబాద్‌లో వేలమంది తెరాసలో చేరేందుకు వస్తున్నారని, కేసీఆర్‌వల్లే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమని భావిస్తున్నారని ఆయన అన్నారు. ఖమ్మం జిల్లాలో వైఎస్సార్సీపి అడ్రస్‌ కూడా గల్లంతవుతోందని ¬ం మంత్రి నాయిని స్పష్టం చేశారు.కేసీఆర్‌ సారథ్యంలో నవతెలంగాణను, బంగారు తెలంగాణను నిర్మించుకుందామని నాయిని పిలుపునిచ్చారు. ఇందుకు కార్యకర్తలు, ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతోనే బంగారు తెలంగాణ సాధ్యమని టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కే కేశవరావు స్పష్టం చేశారు. సలువరు నేతలు టీఆర్‌ఎస్‌ చేరిన సందర్భంగా ఆయన నేతలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ… తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్‌తో కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్టాన్న్రి సాధించుకోవడానికి, ఆ తర్వాత రాష్ట్రం అబివృద్దికి ఎవరు అంకితం అయ్యారో,వారిని ప్రజలు ఎన్నుకున్నారని, అందువల్ల ముఖ్యమంత్రి కెసిఆర్‌కు అండగా ఉండి అభివృద్దికి చేయూత ఇవ్వడానికే తాము టిఆర్‌ఎస్‌ లో చేరామని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. ఆంద్ర నాయకుల కుట్ర వల్లనే తెలంగాణకు విద్యుత్‌ కొరత ఏర్పడిందని ఆయన అన్నారు. దానిని ఎదుర్కునే శక్తి కెసిఆర్‌కు ఉందని అన్నారు. బిజెపి నేతలు ధైర్యం ఉంటే వచ్చే గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలలో గవర్నర్‌ కు హైదరాబాద్‌ పై అధికారాలు ఇవ్వడాన్ని సమర్ధిస్తూ ఎన్నికల మానిఫెస్టోలో చేర్చాలని సవాల్‌ చేశారు. పార్టీ సెక్రటరీ జనరల్‌ కే.కేశవరావు వీరందరికి గులాబి కండువాలు కప్పి స్వాగతం పలికారు. కెసిఆర్‌ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని మంత్రి హరీష్‌ రావు నిర్వహించారు. సీఎం కల్వకుంట్ర చంద్రశేఖర్‌రావుతోనే బంగారు తెలంగాణ సాధ్యమని ఎమ్మెల్సీ వెంకట్రావు స్పష్టం చేశారు. రాష్టాన్న్రి కేసీఆర్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని ఆయన పేర్కొన్నారు.

సిఎం కేసీఆర్‌ను కలిసిన తలసాని

టిడిపి నేత, సనత్‌ నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్‌ సోమవారం  క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. తలసానితో పాటు ఐడీహెచ్‌ కాలనీవాసులు కూడా ముఖ్యమంత్రిని కలిశారు. నాలుగునెలల్లో ఐడీహెచ్‌ కాలనీ ప్రజలకు ఇళ్లు కట్టిస్తామని సీఎం హావిూఇచ్చారు. సాయంత్రం ఐడీహెచ్‌ కాలనీని సందర్శిస్తానని సీఎం వారికి హావిూ ఇచ్చారు. ఈ కాలనీ సమస్యపై ఆయన సిఎంను కలిశారు. ఇదిలావుంటే తలసాని టిఆర్‌ఎస్‌లో చేరుతారన్న ప్రచారం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

ఐడీహెచ్‌ కాలనీని ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతాం: కేసీఆర్‌

ఐడీహెచ్‌ కాలనీని ఆదర్శకాలనీగా తీర్చిదిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రేపట్నుంచే పనులు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. దళితవాడల్లో దారిద్య్రం లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న ఆయన ఐడీహెచ్‌ కాలనీలో వైఫై సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. నిరుపేదలు పైసా చెల్లించనక్కరలేదని, ప్రభుత్వమే భరిస్తుందని ఆయన చెప్పారు. ఐదునెలల్లో పనులు పూర్తిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈరోజు ఉదయం ఈ కాలనీ సమస్యలపై కాలనీవాసులతో కలిసి తెదేపా నేత తలసాని కేసీఆర్‌ని కలిసిన సంగతి తెలిసిందే. వారికిచ్చిన హామీ మేరకు కేసీఆర్‌ కాలనీని సందర్శించారు.