జమ్మూఅబ్జర్వర్ పత్రికపై అసద్ ఫైర్
భేషరతు క్షమాపణకు డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (జనంసాక్షి) : జమ్మూ అబ్జర్వర్ పత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. తన పేరుతో తప్పుడు కథనాన్ని ప్రచురించిన పత్రిక బేషరుతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా భారతీయ ముస్లింలందరూ పాకిస్థాన్‌తో జతకలవాలి అని ఓవైసీ వ్యాఖ్యానించినట్టు వచ్చిన ఓ కథనం సోషల్ మీడియాలో సంచలనం రేపింది. తన లాయర్ ద్వారా నోటీసులు పంపుతానని, ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్ కేసుతోపాటు, పరువు నష్టం దావా కేసును ఫైల్ చేస్తానని ఓవైసీ ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఒకవేళ ఎవరైనా ఆ కథనాన్ని విశ్వసించి తనపై కేసు నమోదు చేస్తే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.