ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు సీపీఎం మద్దతు

2
మతోన్మాదులను ఓడించేందుకే ఈ నిర్ణయం : తమ్మినేని

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి) : మెదక్‌ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి సీపీఎం బేషరతుగా మద్దతు ప్రకటించింది. మతోన్మాదులను ఓడించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే అంశంపై బుధవారం పార్టీ రాష్ట్ర కార్యవర్గం సమావేశమై చర్చించింది. టీఆర్‌ఎస్‌కు ప్రత్యర్థులుగా బరిలోకి దిగిన బీజేపీ, కాంగ్రెస్‌లను ఓడించాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులను ఓడిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా పని చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించాలని నిర్ణయించిన నాయకులు.. ఆ పార్టీతో కలిసి క్షేత్ర స్థాయిలో పనిచేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. సొంతంగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించామని వీరభద్రం తెలిపారు. మెదక్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులను ఓడిస్తామన్నారు. బీజేపీని ఓడించడమే ధ్యేయంగా ప్రచారం చేస్తామన్నారు. మూడు నెలల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ పనితీరు చెప్పుకోదగ్గ స్థాయిలోలేదని స్పష్టంచేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హావిూలన్నింటినీ వెంటనే అధికార పార్టీ అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. మెదక్‌ ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీల మధ్యే ఉంది. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టుల మద్దతు కూడగట్టేందుకు అధికార పార్టీ రంగంలోకి దిగింది. మెదక్‌ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు కమ్యూనిస్టు నేతలతో చర్చలు జరిపారు. అందుకు కొంత సమయం కావాలని రెండు పార్టీలు తెలిపాయి. సీపీఐ ఇప్పటికే బేషరతుగా మద్దతు ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా పనిచేస్తామని తెలిపింది. తాజాగా సీపీఎం కూడా అదే బాట పట్టింది. అధికార టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించడంతో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ప్రచారం చేయనున్నట్లు పేర్కొంది.