దుబాయ్‌లో తెలంగాణ బిడ్డల్ని రక్షించండి

1

సుష్మాస్వరాజ్‌కు కేటీఆర్‌ లేఖ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : దుబాయ్‌లో మరణశిక్ష పడిన సిరిసిల్లకు చెందిన ఆరుగురిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని గురువారం తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కేంద్రం చొరవ తీసుకుంటే వారిని విడిపించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే హతుడి భార్య క్షమాభిక్షకు ఒప్పుకున్నందున నిందితుల విడుదలకు చొరవ తీసుకోవాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు కేటీఆర్‌ లేఖ రాశారు. దుబాయ్‌ లో ఓ హత్య కేసులో సిరిసిల్లకు చెందిన ఆరుగురికి అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. దుబాయ్‌లో మరణశిక్ష పడిన సిరిసిల్ల వాసులకు క్షమాభిక్ష విషయమై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖలో వివరించారు.  ఇప్పటికే మృతుడి భార్య క్షమాభిక్షకు ఒప్పుకుందని, నిందితులు జరిమానా కూడా చెల్లించిన విషయాన్ని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. నేపాల్‌ ఎంబసీతో మాట్లాడి తదుపరి చర్య తీసుకోవాలని లేఖలో కోరారు.