భారత్‌పై ఆల్‌ఖైదా కన్ను

4

అప్రమత్తమైన ¬ంశాఖ

వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : భారతదేశంపై ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదా కన్ను పడింది. దీంతో ¬ంశాఖ అప్రమత్తమైంది. అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడించిన ఉగ్రవాద సంస్థ అల్‌ ఖైదా ఇప్పుడు భారత ఉప ఖండంలో కూడా ఓ కొత్త శాఖ తెరిచిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థ నాయకుడు ఆయమాన్‌ అల్‌ జవహరి ప్రకటించారు. భారత ఉప ఖండంలోనే చిత్రీకరించిన ఓ వీడియో మెసేజీలో ఈ విషయం తెలిపారు. ఆన్‌లైన్‌ జీహాదిస్ట్‌ ఫోరంలో ఈ వీడియో

కనిపించింది. ప్రధానంగా బర్మా, బంగ్లాదేశ్‌లతోపాటు భారతదేశంలోని కొన్ని భాగాల్లో ముస్లిం ఖలీఫా వ్యవస్థను పునరుద్ధరించడానికి ఈ కొత్త దళం పనిచేస్తుందని ఆ వీడియోలో

అల్‌ జవహరి చెప్పినట్లుగా ఉంది. ఈ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కుకునేందుకు భారత ¬ంశాఖ చర్యలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. అత్యాధునిక ఆయుధ పరిజ్ఞానం ఉన్న అమెరికాను వణికించిన ఆల్‌ఖైదా విషయంలో భారత్‌ మరింత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.