భారత్‌-ఆస్ట్రేలియా ‘అణు’బంధం

1

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : యురేనియం సహకార ఒప్పందంపై భారత ప్రధాని నరేంద్రమోడీ, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్‌ సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబాట్‌ ఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆయనకు సాదర స్వాగతం పలికారు. ”ఆస్ట్రేలియా ప్రధానికి సాదర స్వాగతం. ఆయన పర్యటన ఆస్ట్రేలియా, భారతదేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తుందని నేను నమ్ముతున్నాను” అని తన ట్విట్టర్‌లో కూడా పెట్టారు. దీంతో అబాట్‌

కూడా ఎంతగానో సంతోషించారు. ‘భారత ప్రధాని నరేంద్రమోడీ అద్భుతమైన అధికారిక స్వాగతం పలికారు’ అని ఆయన ట్వీట్‌ చేశారు. విమానాశ్రయంలో అబాట్‌కు కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి పీయూష్‌

గోయల్‌ స్వాగతం పలికారు. టోనీ అబాట్‌ గురువారమే భారత్‌ వచ్చి ముందుగా ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ రెండు దేశాల మధ్య అణు సహకార ఒప్పందం చారిత్రక మైలురాయి అని చెప్పారు. అణు సహకార ఒప్పందం భారత్‌, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని మోడీ అన్నారు. భారత్‌ అభివృద్ధిలో ఆస్ట్రేలియా కీలక పాత్ర పోషించనుందని చెప్పారు. భారత్‌ వైద్య రంగానికి విస్తృతస్థాయిలో సహకారం అందిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని టోనిఅబాట్‌ స్పష్టం చేశారు.